Begin typing your search above and press return to search.
తగ్గేదేలే.. కేసీఆర్ కాళ్లకు ఒక్కసారి కాదు.. వందసార్లు మొక్కుతా!
By: Tupaki Desk | 21 Nov 2022 4:31 AM GMTతెలంగాణలో ఉన్నతాధికారుల తీరు వివాదాస్పదమవుతున్నా వారు వెనక్కి తగ్గడం లేదు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా బేఖాతరు చేస్తున్నారు. ఉన్నత పదవుల్లో ఉండి సీఎం కేసీఆర్ ప్రాపకం కూడా ప్రయత్నిస్తున్నారని.. ఆయన పాదాలపై పడి ఉన్నత పదవుల హోదాను దిగజారుస్తున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల వైద్య కళాశాలల ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు... కేసీఆర్ కాళ్లపై పడి ఆయనకు మొక్కిన సంగతి తెలిసిందే. కుర్చీలోంచి సీఎం లేచిన అనంతరం ఒకసారి, వెళ్తుండగా మరోసారి ఆయన కాళ్లపై పడి తన ప్రభు భక్తిని ఆయన చాటుకున్నారు.
ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఉన్నత స్థాయి పదవిలో ఉండి సీఎంకు కాళ్లు మొక్కడమేంటని నెటిజన్లు, వివిధ రాజకీయ పక్షాల నేతలు ఘాటు విమర్శలు చేశారు. దీంతో ఈ ఘటనపై డీహెచ్ శ్రీనివాసరావు తాజాగా వివరణ ఇచ్చారు.
కొత్తగూడెంలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్న డీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తాను కేసీఆర్‌కు పాదాభివందనం చేయడాన్ని సమర్థించుకున్నారు. ఈ విషయాన్ని కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌కు ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతా అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తనకు పితృ సమానులు అని తెలిపారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తున్న పాలనా దక్షుడని కొనియాడారు. అలాంటి వ్యక్తి పాదాలు తాకడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
మరోవైపు డీహెచ్ శ్రీనివాసరావు సొంత ఊరు కొత్తగూడెం అని చెబుతున్నారు. కొత్తగూడెం నుంచి వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో కొత్తగూడెంలో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొంటున్నారు.
కొత్తగూడెం పట్టణమంతా ఏ రాజకీయ నేతకు, చివరకు స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు కూడా లేని రీతిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అంటున్నారు. తనను తాను గొప్పగా చూపించుకోవడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు కూడా తనకు ఉన్నాయని చెప్పుకోవడమే లక్ష్యంగా డీహెచ్ శ్రీనివాసరావు కేసీఆర్ కాళ్లకు మొక్కారని చెబుతున్నారు.
గతంలో మెదక్ కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి సైతం ఇలాగే బహిరంగ సభల్లో, వివిధ సమావేశాల్లో కేసీఆర్‌కు సాష్టాంగ నమస్కారం చేసేవారు. ఆయనకు పాదాభివందనాలు చేసి కేసీఆర్‌ను ఏ రేంజులో పొగిడేవారు. ఇందుకు ఆయనకు ప్రతిఫలం కూడా దక్కింది. తన కాళ్లు మొక్కినందుకు వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి సత్కరించారు.
ఈ నేపథ్యంలో డీహెచ్ శ్రీనివాసరావు కూడా తన కాళ్లు మొక్కినందుకు కొత్తగూడెం సీటును వచ్చే ఎన్నికల్లో ఆయనకు కేటాయించినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రతిపక్షాలు, నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.