Begin typing your search above and press return to search.
గ్రేట్ న్యూస్: లక్ష ఇన్సూరెన్స్ ఫ్రీ
By: Tupaki Desk | 29 Feb 2016 6:52 AM GMTకుటుంబంలో ఒకరు పెద్ద అనారోగ్యానికి గురయ్యారంటే ఇక ఆ ఫ్యామిలీ రోడ్డున పడ్డట్లే. ముఖ్యంగా కిడ్నీలు పాడై డయాలసిస్ చేసుకోవాల్సిన వాళ్లు ఎంత ఇబ్బంది పడతారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రోజూ డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైతే ఆ కుటుంబం పరిస్థితి అధోగతే. అందుబాటులో డయాలసిస్ సెంటర్లుండవు. ఎక్కడికో వెళ్లాలి. వేలకు వేలు పోయాలి. ఈ ఖర్చు భరించలేక ప్రాణంపై ఆశలు వదిలేసుకుంటుంటారు. ఇలాంటి బాధితులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.
ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో డయాలిసిస్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు జైట్లీ. జాతీయ డయాలిసిస్ సర్వీస్ ను ప్రవేశపెడతామని.. పేద రోగులు ఉచితంగా డయాలసిస్ చేయంచుకునే ఏర్పాటు చేస్తామని చెప్పారు. డయాలిసిస్ కిట్ లపై ఎక్సైజ్ డ్యూటీ, ఇతర పన్నులను మినహాయిస్తామని.. బయట కూడా తక్కువ ఖర్చుతో డయాలసిస్ చేయించునే వీలు కల్పిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు ఆరోగ్య స్కీమ్ కింద పేద కుటుంబాలకు లక్ష రూపాయల మేర ఆరోగ్య బీమా కల్పిస్తామని.. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 30 వేల రూపాయలు బీమా ఇస్తామని జైట్లీ వెల్లడించారు.