Begin typing your search above and press return to search.
మారిన మైండ్ సెట్ లెక్క చెప్పిన తాజా సర్వే
By: Tupaki Desk | 31 July 2019 4:42 AM GMTవచ్చే ఆదాయం.. చేసే ఖర్చు విషయంలో ప్రజల ఆలోచనాతీరులో వచ్చిన మార్పును చెప్పేసిందో సర్వే. గతంలో మాదిరి కాకుండా కొత్తగా ఉద్యోగం చేరిన వారి దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తున్న వారంతా ఖర్చు విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు? వారి మైండ్ సెట్ ఎలా ఉంది? దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు? సిబిల్ స్కోర్ లాంటి విషయాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంత? వ్యక్తిగత రుణాల్ని తీసుకునే విషయంలో గతానికి.. వర్తమానానికి వచ్చిన మార్పు ఏమిటి? లాంటి అంశాల మీద బ్యాంక్ బజార్.కామ్ ఆస్పిరేషన్ ఇండెక్స్ సర్వే తాజాగా వివరాలు వెల్లడించింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాల్ని పేర్కొంది.
కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు ఖర్చుకే ప్రాధాన్యత ఇస్తారన్న భావన తప్పని.. వారు సైతం పొదుపుకు ప్రాధాన్యత ఇస్తున్న కొత్త విషయాన్ని తాజా సర్వే వెల్లడించింది. వ్యక్తిగత రుణాల్ని తీసుకునే విషయంలో సాధ్యమైనంత దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. క్రెడిట్ కార్డుల్ని ఎక్కువగా వినియోగిస్తున్నా.. అందులో అధిక శాతం ఖర్చులు జీవనశైలికి సంబంధించినవేనని చెబుతున్నారు.
తాజాగా వెల్లడించిన సర్వేలో 22-45 ఏళ్ల వయసున్న వారు.. రూ.30వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని భాగస్వామ్యం చేశారు. 12 నగరాల్లో సాగిన సర్వేలో బయటకొచ్చిన ప్రధానాంశం.. తాము సాధించానుకుంటున్న ఆర్థిక ఆశయాల విషయంలో 86.9 శాతం మంది క్లారిటీతో ఉన్నారు. ఆర్థిక లక్ష్యసాధన విషయంలో మెట్రో నగరాల్లోని వారు 86.7 శాతం స్పష్టతతో ఉంటే.. ఇతర ప్రాంతాల్లో ఉండే వారిలో ఇది 87.4 శాతంగా ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో 87.8 శాతం మంది ప్రాధాన్యత ఇస్తుండగా.. కుటుంబ సంబంధాలకు 87.8 శాతం.. ప్రతిష్ఠ పెంచుకోవాలని 87.3 శాతం.. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని 84.9 శాతం మంది భావిస్తున్నారు. సంపదను క్రియేట్ చేసేందుకు 28-34 మధ్య వయస్కులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటే.. కుటుంబ సంబంధాలకు అత్యధికంగా విలువ ఇస్తున్న వారు 35-45 ఏళ్ల మధ్య వారిగా తేలింది. సంపాదించిన సంపాదనలో 30 శాతానికి మించి ఈఎంఐలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపించింది.
రిటైర్మెంట్ ప్లాన్లను 29 ఏళ్ల నుంచే షురూ చేస్తుండటం గమనార్హం. 56 ఏళ్ల వయసు వచ్చేసరికి కోటి నుంచి రెండు కోట్ల రూపాయిల వరకూ చేతిలో ఉండాలన్న ఆలోచన అత్యధికుల్లో కనిపించింది. క్రెడిట్ స్కోర్ మీద అవగాహన బాగా పెరిగింది. సంపాదనలో ఖర్చు 62 శాతం ఉంటే 38 శాతం పొదుపునకు కేటాయిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. 93 శాతం మంది పిల్లలకు చదువు చెప్పించటమే లక్ష్యంగా పొదుపు.. పెట్టుబడులు పెడుతున్నట్లుగా గుర్తించారు. సొంతిల్లు కోసం 92.8 శాతం.. ఖరీదైన వాహనం కోసం 88.4 శాతం మంది ప్రయత్నిస్తున్నట్లుగా గుర్తించారు.