Begin typing your search above and press return to search.
మంత్రి ఈటెల.. మాస్కులు పెట్టుకోవటం లేదెందుకు?
By: Tupaki Desk | 7 March 2020 5:55 AM GMTకరోనా పుణ్యమా అని మాస్కులకు ఎంత గిరాకీ వచ్చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అవసరం ఉందా? లేదా? అన్నది వదిలేసి.. మాస్కులు ముఖానికి తగిలించుకుంటే చాలు.. కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకుంటామన్న అపోహ హైదరాబాదీయుల్ని ఎంతలా పట్టేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు రూపాయిల మాస్కును.. పాతిక రూపాయిలు పెట్టి మరీ కొనేస్తున్నారు. వందలాది రూపాయిల్ని వెచ్చించి మరీ మరింత సేఫ్ గా ఉండేందుకు పడుతున్న ప్రయాస అంతా ఇంతా కాదు.
సామాన్యులే ఇంత జాగ్రత్తగా ఉంటే.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్ మరెంత కేర్ ఫుల్ గా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ.. ఆయన మాత్రం మిగిలిన వారికి భిన్నంగా ముఖానికి మాస్కులు ధరించటానికి ససేమిరా అంటున్నారు. ఆసుపత్రికి.. ప్రత్యేకంగా రోగుల వద్దకు వెళ్లిన సమయంలో మాత్రం మాస్కులు ధరిస్తున్నారే తప్ప.. మిగిలిన సందర్భాల్లో మాత్రం మామూలుగానే ఉంటున్నారు.
అందరూ మాస్కులు పెట్టుకుంటే.. మీరేమో ఇలా ఉంటున్నారేంటి? సేఫ్ గా ఉండాలి కదా? అన్న ప్రశ్నను బాగా తెలిసిన మీడియా మిత్రులు ఆయనతో అంటే.. ఈటెల స్పందించిన తీరు తెలుసుకోవాల్సిందే. కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యమని.. వైరస్ సోకిన వారు తప్పించి.. ఇతరులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని.. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయటం కోసమే తాను మాస్కుల్ని వినియోగించటం లేదని చెప్పారు. ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వటం కోసమే తాను మాస్కుల్ని వాడటం లేదని.. ఆ మాటకు వస్తే ఆ అవసరమే లేదని చెప్పారు. ఈటెల వారు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత.. మాస్కుల విషయంలో ఏం చేయాలో మీకు అర్థమవుతుందా?