Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సిన్ పై స్పష్టతనిచ్చిన కేంద్రం
By: Tupaki Desk | 13 Oct 2020 12:30 PM GMTవచ్చే ఏడాది ప్రారంభానికి భారత దేశానికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పలు దేశాల నుంచి టీకా అందుబాటులో ఉండొచ్చని అన్నారు.
ఒకటి కంటే ఎక్కువ సంస్థల నుంచి వచ్చే ఏడాది ప్రారంభానికి భారత్ లో టీకా అందుబాటులోకి వస్తుందని అంచనావేస్తున్నాం. మా నిపుణుల బృందాలు టీకా పంపిణీకి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.
భారత జనాభా దృష్ట్యా కేంద్రం ఒకటి కంటే ఎక్కువ టీకా అభివృద్ధి సంస్థలతో జట్టు కట్టాల్సిన అవసరం ఉందని మంత్రి ప్రజలకు వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్. వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ కూడా ఇదే అభిప్రాయపడ్డారు. టీకా 2020 చివరిలో లేదా 2021 ఆరంభంలో వస్తుందని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40 టీకాలు వివిధ దశల్లో క్లినికల్ ట్రయల్స్ ప్రయోగాల స్థాయిలో ఉన్నాయి. వాటిలో 10 టీకాలు మూడో దశకు చేరుకున్నాయి.