Begin typing your search above and press return to search.
కరోనా ఐదో దశ.. హెల్త్ మినిస్టర్ కీలక వ్యాఖ్యలు !
By: Tupaki Desk | 12 Nov 2021 3:30 AM GMTకరోనా మహమ్మారి జోరు మాములుగా లేదు. ఒకదాని తర్వాత మరో వేవ్ అంటూ కరోనా వస్తూనే ఉంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా ఐదో దశ దేశంలో త్వరలో ప్రారంభం కావొచ్చునని.. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ ఆరోగ్యమంత్రి ఆలివర్ వెరాన్ హెచ్చరించారు. ఇది గతంలో వాటికంటే ప్రమాదకరమైందని, దాని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం కొవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటించడమేనన్నారు. దేశంలో కరోనా మహమ్మారి విధ్వంసం ఇంకా ముగియలేదని, కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వెరాన్ సూచించారు. ప్రస్తుతం అక్కడ రోజువారీగా పదివేలకు కాస్త పై స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వారంలోనే అక్కడ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.
తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ మధ్య నుంచి దేశంలో కరోనా కేసులు నిరంతరంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. టీకాలు, మాస్క్‌లు, పరిశుభ్రతతో ఐదో వేవ్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆలివర్ అన్నారు. ఫ్రాన్స్ వ్యాప్తంగా బుధవారం 11,883 కొత్త కేసులు నమోదయ్యాయి. 10వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదవడం వరుసగా రెండోరోజు. ఇప్పటి వరకు 73.46లక్షల మంది మహమ్మారి బారిన పడగా.. వైరస్ బారినపడి 1.19లక్షల మందికిపైగా మృత్యువాతపడ్డారు.
గత ఏడాది నవంబర్ సమయంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రోజుకు యాభై వేల స్థాయిలో అక్కడ కేసులు రావడం పీక్ స్టేజ్. ఆ తర్వాత కేసులు నెమ్మదించాయి.
ఇక ఈ 2021 సంవత్సరంలో ఏడాది కూడా అక్కడ రెండు సార్లు కరోనా విజృంభించి, మళ్లీ తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల లో ఇండియాలో కరోనా విజృంభించిన వేళ ఫ్రాన్స్ కూడా ముప్పు తిప్పలు పడింది. ఆ సమయంలో రోజువారీగా యాభై వేల కేసులు నమోదు అయ్యాయి. ఇక, జూన్ నెల నాటికి రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. కానీ, ఆ ఊరట ఎక్కవ రోజులు దక్కలేదు. మళ్లీ ఆగస్టులో అక్కడ మరో వేవ్ విజృంభించింది. సెప్టెంబర్ నాటికి మళ్లీ కేసుల సంఖ్య తగ్గినా.. ఇప్పుడు మళ్లీ కేసుల సంఖ్య లో పెరుగుదల చోటు చేసుకుంటోంది. ఒక నెల పెరగడం, మరో నెల తగ్గడం ఇదే తరహాలో అక్కడ కరోనా మహమ్మారి వ్యాప్తి సాగుతూ ఉంది. మరి కొన్ని యూరప్ దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.