Begin typing your search above and press return to search.
గేటెడ్ కమ్యూనిటీ వాసులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
By: Tupaki Desk | 19 July 2020 10:33 AM GMTమహమ్మారి వైరస్ విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. వైరస్ రాకుండా జాగ్రత్తలు.. కట్టడి చర్యలు వివరిస్తోంది. ఆ వైరస్‌పై అవగాహన కల్పిస్తూనే సూచనలు చేస్తోంది. తాజాగా గేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ వ్యాపించకుండా చేయాల్సిన పనులు.. నియమనిబంధనలు చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
- ఎంట్రీ పాయింట్స్ - వర్క్ ప్లేసెస్ లో శానిటైజర్లు తప్పనిసరిగా పెట్టాలి.
- ఎంట్రీ - ఎగ్జిట్ పాయింట్స్ వద్ద విజిటర్స్ - సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. లక్షణాలు లేనివారిని మాత్రమే లోపలికి అనుమతించాలి.
- విక్రేతదారులు - పనివాళ్లు - కార్ క్లీనర్స్ - డెలివరీ బాయ్స్ అందరికీ కూడా థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేయాలి.
- పార్కులు - కారిడార్లు - లిఫ్ట్ లాబీలు - జిమ్ లు - క్లబ్ లు మొదలైన అన్ని సాధారణ ప్రాంతాల్లో కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి
- 65 ఏళ్లు పైబడిన వారు - గర్భిణీలు - పదేళ్లలోపు పిల్లలు ఇంట్లోనే ఉండాలి.
- తరచు సబ్బుతో చేతులు కడుక్కోవడం - మాస్కులు ధరించాలి
- ఆరు బయట ఉమ్మి వేయడం నిషేధం.
- ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే జిల్లా హెల్ప్‌లైన్ కు సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది.
- గేటెడ్ కాంప్లెక్స్ ను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించినట్లయితే - రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్ డబ్ల్యుఎ) స్థానిక ఆరోగ్య అధికారులతో సహకరించి - నియంత్రణ ప్రణాళికలో పేర్కొన్న విధంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం గేటెడ్ కమ్యూనిటీస్ వాసులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మహమ్మారి వైరస్ నివారణకు అందరూ సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది.