Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఫలిస్తోంది..మనది ఇంకా రెండో దశే

By:  Tupaki Desk   |   31 March 2020 2:30 AM GMT
లాక్ డౌన్ ఫలిస్తోంది..మనది ఇంకా రెండో దశే
X
వార్తల కంటే వదంతులు వేగంగా వ్యాప్తి చెందుతున్న కాలమిది. దీంతో గవర్నమెంట్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొద్ది రోజులుగా ఇండియా మూడో దశలోకి వెళ్లిపోయిందని ప్రజలను భయబ్రాంతులను చేస్తూ వదంతులు వస్తున్నాయి. దీనిని గుర్తించిన కేంద్రం దానిపై స్పష్టమైన ప్రకటన చేసింది. భారతదేశం ఇంకో రెండో దశ (లోకల్ ట్రాన్స్ మిషన్)లోనే ఉందన్నారు. కొన్ని సమూహాలకు వ్యాపించినా సోర్స్ గుర్తించే పరిస్థితి ఉన్నంతవరకు అది రెడో దశే అవుతుందని కేంద్రం పేర్కొంది.

ఈ సందర్భంగా దశల గురించి కూడా ప్రకటనలో పేర్కొంది.

మొదటి దశ : విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వ్యాధి ఉండటం.

రెండో దశ : విదేశాల నుంచి మనదేశానికి వచ్చిన వారి నుంచి వారి బంధువులు - మిత్రులు - సన్నిహితులకు వ్యాధి సోకడం. ఈ దశలో ఎవరికి వ్యాధి ఉంది - ఎవరి వల్ల వారికి వచ్చింది గుర్తించడం చాలా సులువు అని కేంద్రం పేర్కొంది.

మూడో దశ : దీనిని కమ్యూనిటీ స్ప్రెడ్ అంటారు. ఏ ట్రావెల్ హిస్టరీ లేని వారికి వ్యాధి రావడం ఒక ఎత్తు అయితే... అది ఎవరి వల్ల సోకిందో కూడా తెలియకపోవడం ఈ దశలో ఉంటుంది. ఇంతవరకు భారత్ లో గుర్తించిన కేసులన్నిటికీ వ్యాధి సోకిన మూలాలు తెలిశాయి. కాబట్టి... మనం మూడో దశలోకి పోలేదని కేంద్రం స్పష్టంచేసింది.

లాక్ డౌన్ నిర్ణయం ప్రధాని నరేంద్రమోడీ సరైన సమయంలో తీసుకోవడం వల్ల మన దేశం మూడో దశలోకి పోకుండా అడ్డుకోగలిగాం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐసీఎంఆర్ ఉన్నతాధికారి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ మన దేశం క్షేమంగా ఉందని, గత ఆరు రోజుల్లో కేసులు పెరిగినా... కేవలం మన వద్ద రెట్టింపు అయ్యింది - మిగతా దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉందని వేలల్లోకి పోయిందన్నారు. ఇది లాక్ డౌన్ వల్ల కలిగిన ప్రయోజనం అన్నారు. మార్చి 28 నాటి లెక్కల ప్రకారం... దేశంలోని 27 రాష్ట్రాల్లో 160 జిల్లాల్లో ఈ వ్యాధి వ్యాపించినట్లు ఆయన పేర్కొన్నారు. మన దగ్గర నమోదైన కేసులు సుమారు 1100 ఉండగా... వాటిలో ముంబై నగరంలోనే 81, కేరళలోని కసరఘడ్ జిల్లాలో 78 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మనం ఇదే క్రమశిక్షణతో సామాజిక దూరం పాటిస్తే... కరోనాపై విజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు.