Begin typing your search above and press return to search.
ఎన్నికల వేళ షాక్..హెల్త్ స్కీం సేవలన్నీ బంద్
By: Tupaki Desk | 30 Nov 2018 5:10 PM GMTఓ వైపు హోరా హోరీగా ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు కీలకమైన పరిణామం ఒకటి తెర మీదకు వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ - ఎంప్లాయిస్ హెల్త్ స్కీం - జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ కింద చేసిన చికిత్సలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మేరకు తెలంగాణ నెట్ వర్క్ హస్పిటల్స్ అసోషియేషన్(టీఏఎన్ హెచ్ ఏ) అధ్యక్షులు రాకేష్ తెలిపారు.
తెలంగాణ నెట్ వర్క్ హస్పిటల్స్ అసోషియేషన్ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆర్థిక భారంతోనే ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ స్కీమ్ లను నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు స్పష్టం చేశారు. గత పన్నెండు నెలలుగా ఈ స్కీమ్ ద్వారా చేసిన ఆపరేషన్స్ - వైద్యానికి సంబంధించి ఎలాంటి చెల్లింపులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు అన్ని ఆసుపత్రులకు పన్నెండొందల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్స్ చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. తప్పని పరిస్థితుల్లోనే ఈ రోజు అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం - జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ నిలిపి వేస్తున్నారు అసోషియేషన్ వెల్లడించింది.
కాగా,రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద నెట్ వర్క్ ఆసుపత్రులలో అందించే అన్ని రకాల సేవలకుగాను నెలకు రూ.120 కోట్లు వరకు అవుతోందని తెలుస్తోంది. దాదాపు సంవత్సరం బకాయిలు నిలిచిపోయాయని చెబుతున్నారు. ఈ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలో నిధులను ఎప్పటికప్పుడు సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది మొదటి నుంచి ఈ ప్రక్రియ సవ్యంగా జరగడంలేదని తెలుస్తోంది. ఆస్పత్రులు తమకు రావాల్సిన బిల్లులను సమర్పించిన తర్వాత ఎప్పటికోగానీ ప్రభుత్వం నిధులను విడుదల చేయడం లేదు. దీంతో ఆరోగ్య శ్రీ సేవల్ని అందించేందుకు ప్రైవేటు - సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు..నిరాకరిస్తున్నాయి. ఇదే విషయంపై ఇంతకు ముందు కూడా ఆసుపత్రులు తమ నిరసనను వ్యక్తం చేశాయి. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో..సేవల్ని నిలిపేయాని తాజాగా నిర్ణయించాయి. ఎన్నికల వేల ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావం చూపేదని పలువురు అంచనా వేస్తున్నారు.