Begin typing your search above and press return to search.
సామాన్యుడి దెబ్బకు షేర్ మార్కెట్ షేక్ అయ్యింది
By: Tupaki Desk | 13 Jun 2016 12:23 PM GMTఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న ఒక నిర్ణయం సోమవారం స్టాక్ మార్కెట్ ను షేక్ చేసేసింది. బడుగు.. బలహీన వర్గాల వారికి తక్కువ ధరలకే వైద్య సేవలు అందించటం లేదంటూ ఐదు ఆసుపత్రుల మీద ఢిల్లీ రాష్ట్ర సర్కారు భారీగా జరిమానా విధించిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు ఆసుపత్రులకు రూ.503 కోట్ల భారీ జరిమానా విధించటంతో షేర్ మార్కెట్ గజగజా వణికిపోయింది.
హెల్త్ కేర్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురై.. మార్కెట్లో భారీగా నష్టాల్ని మూటగట్టుకుంది. భూకేటాయింపు సందర్భంగా చేసుకున్న లీజు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఫోర్టిస్ ఆసుపత్రిపై ఢిల్లీ సర్కారు సీరియస్ కావటంతో.. షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే.. ఢిల్లీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కోర్టులో సవాలు చేయనున్నట్లుగా కంపెనీ పేర్కొంది. మొత్తానికి సామాన్యుడి సర్కారుగా పేరొందిన ఢిల్లీ సర్కారు తీసుకున్న నిర్ణయం షేర్ మార్కెట్ ను ప్రభావితం చేయటం ఒక ఎత్తు అయితే.. ఈ అంశాన్ని కోర్టులో సవాలు చేస్తామంటూ సదరు సంస్థ పేర్కొన్న నేపథ్యంలో కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.