Begin typing your search above and press return to search.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు
By: Tupaki Desk | 5 April 2020 8:34 AM GMTకరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తల్లి నుంచి బిడ్డకు కరోనా వైరస్ సోకిందని సర్వత్రా ఆందోళన చెందగా.. తల్లీబిడ్డ ఆరోగ్యంతా ఉన్నారని వైద్యులు ప్రకటించడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఈ సంఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అయితే కరోనా బాధితురాలు ఓ బిడ్డకు జన్మనివ్వడం దేశంలో ఇదే తొలి ఘటన. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకి ఉంటుందా అని చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఉత్కంఠ ఏర్పడింది. తల్లీనుంచి బిడ్డకు కరోనా సోకుతుందా? అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. అయితే ఆ విధంగా సోకే అవకాశాలు చాలా తక్కువ అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆ బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంతో ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ బిడ్డకు కరోనా లక్షణాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ బిడ్డను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కరోనా లక్షణాలు తేలితే పాప ప్రాణానికే ప్రమాదం ఉన్న సమయంలో వైద్యులు అప్రమత్తంగా ఉన్నారు.
వాస్తవంగా ఆమె డెలివరీకి ఇంకా వారం రోజుల సమయం ఉండగా.. శుక్రవారం ఆమెకు నొప్పులు రావడంతో ఆమెను వెంటనే ఎయిమ్స్ లో చేర్పించారు. ఆమెకు అతికష్టం మీద ప్రసవం చేశారు. శస్త్ర చికిత్స చేసి పండంటి మగబిడ్డను బయటకు తీశారు. ఇప్పటివరకు అయితే ఆ బిడ్డకు కరోనా లక్షణాలేవీ లేవని వైద్య నిపుణురాలు నీర్జా భట్ల తెలిపారు. అయితే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రతలో భాగంగా వైద్యులు ఆ బాబును ప్రత్యేక వార్డులో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.