Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో: నా పెళ్లాన్ని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారా? దీనికి జవాబిచ్చేవారెవరు?
By: Tupaki Desk | 1 Dec 2021 8:02 AM GMT‘‘మీకు ఇప్పటికే పెళ్లి అయ్యింది. ప్రభుత్వం తరఫున వచ్చిన వారు.. ఇప్పటికే మీ పెళ్లంగా ఉన్న ఆమెతో మీకు మళ్లీ పెళ్లి చేస్తామని చెప్పటం ఏమిటి? నా పెళ్లాన్ని నాకే ఇచ్చి పెళ్లి చేయటమా?’’అంటూ ఒకింత ఆవేశం.. అంతకు మించిన ఆందోళనతో ప్రశ్నిస్తున్న పెద్దాయన మాటలు విన్నంతనే.. నిజమే కదా? ఇలాంటి నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకోవటం ఏమిటన్న సందేహం కలుగుతుంది.
ఇప్పటికే పట్టా ఉన్న భూమికి మళ్లీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తానంటూ అధికారులు తరచూ రావటంపై ఈ వీడియోలోని పెద్ద మనిషి ఆందోళనను వినే ఉంటారు.
కొంత అర్థమై.. కొంత అర్థం కానట్లుగా ఈ వ్యవహారం ఇప్పుడీ పెద్ద మనిషికి మాత్రమే కాదు.. ఏపీలోని వేలాది మంది ఆక్రోశంగా చెప్పాలి. అసలీ రచ్చ ఏమిటి? ఇదెలా మొదలైంది? దీనికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే షాకింగ్ అంశాలు బయటకు వస్తాయి. ఈ మధ్యనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త పథకాన్ని షురూ చేయటం తెలిసిందే. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా అధికారులు పెట్టిన షరతులు.. కొత్తగా చేస్తున్న ప్రచారం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.
సాధారణంగా ఎవరైనా సరే.. ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా కట్టడాలు కట్టుకుంటే.. అలాంటి వారందరి వివరాలతో రిజిస్ట్రేషన్లు చేయటాన్ని ఎవరూ తప్పు పట్టరు. అందుకు భిన్నంగా స్థలాలు కొనుక్కొని.. ఇల్లు కట్టుకొని.. గత ప్రభుత్వాల నుంచి గృహ నిర్మాణానికి లబ్థి పొంది ఉంటే.. అలాంటి వారుఇప్పుడు మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని.. గత ప్రభుత్వాల నుంచి తీసుకున్న గృహ రుణాల్ని చెల్లించాలని అడుగుతున్న ప్రభుత్వ తీరుపై పలువురు మండిపడుతున్నారు.
ఏపీలోని 13 జిల్లాల్లో ఈ మధ్య ఉప ఎన్నిక జరిగిని బద్వేల్ నియోజకవర్గం ఉన్న కడప జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని షురూ చేశారు. తాజాగా ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది కానీ ప్రభుత్వ స్థలంలో ఇంటిని నిర్మించుకున్నా లబ్థిదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు.
ఇదంతా బాగానే ఉన్నా.. అసలు ట్విస్టు ఎక్కడ ఉందంటే.. సొంత స్థలాలు ఉండి ప్రభుత్వ సాయంతో హౌసింగ్లోన్ తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న వారికి సైతం సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగస్వాములను చేయాలని తీసుకోవటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వైరల్ వీడియోలో చూస్తే.. సొసైటీ నుంచి స్థలం కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇవాల్టి రోజున ప్రభుత్వం తరఫున అధికారులు వచ్చి ఇంటిని మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నా పెళ్లాన్ని మళ్లీ నాతోనే పెళ్లి చేయించటం ఏమిటన్న వాదనలో అర్థం ఉందని చెప్పక తప్పదు. ఇలాంటివి సామాన్యుల్లో అనవసరమైన గందరగోళాన్నిపెంచి.. ప్రభుత్వం మీద ప్రతికూల అభిప్రాయాన్ని పెంచుతాయన్నది మర్చిపోకూడదు.