Begin typing your search above and press return to search.

రష్యా రక్షణ మంత్రి గుండె పోటుకు ఉక్రెయిన్ కారణం.. నిజమెంత?

By:  Tupaki Desk   |   27 March 2022 4:34 AM GMT
రష్యా రక్షణ మంత్రి గుండె పోటుకు ఉక్రెయిన్ కారణం.. నిజమెంత?
X
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తీవ్ర వాగ్వాదం తర్వాత రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు గుండె పోటుకు గురయ్యారని ఉక్రెయిన్ మంత్రి అంటన్ హెరాష్ చెంకో తెలిపారు. ఉక్రెయిన్ లో ప్రత్యేక సైనిక చర్య వైఫల్యం గురించి పుతిన్ ను నిలదీశారు. యుద్ధానికి రెండో సూత్రధారిగా పరిగణించే రక్షణ మంత్రి మార్చి 11 నుంచి బహిరంగంగా కనిపించక పోవడానికి ఇదే కారణం అని ఉక్రెయిన్ మంత్రి అంటోన్ హెరాష్ చెంకో తెలిపారు.

అయితే రష్యా రక్షణ మంత్రి మార్చి 24న టెలివిజన్ లో కనిపించారు. అయితే ఆ ఫుటేజీ కొత్తదా పాతదా అనేది మాత్రం ఇంకా తెలియ రాలేదు. అయితే ఆయన హఠాత్తుగా మాయం అవడం పై పలు రకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. రష్యా అధ్యక్షుని కార్యాలయం క్రెమ్లిన్ అధికారులు.. ఖార్కివ్ లేదా కైవ్ వంటి ప్రధాన ఉక్రేనియన్ నగరాలను ఇంకా స్వాధీనం చేసుకోనందుకు భీకర పోరు చేస్తుంది. నెల రోజులుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్ పై రష్యా ఆధిపత్యం దక్కించుకోలేక పోతుంది.

అయితే రక్షణ మంత్రి గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగినప్పుడు క్రెమ్లిన్ రోజువారీ ప్రెస్ బ్రీఫింగ్ లో ఈ సమస్యను లేవనెత్తినట్లు గార్డియన్ నివేదిక పేర్కొంది. అయితే రక్షణ మంత్రి ప్రత్యేక సైనిక ఆపరేషన్ లో బిజీగా ఉన్నారని... మీడియా కార్య కలాపాలకు ఇది సరైన నమయం కాదని క్రెమ్లిన్ ప్రతినిధి చెప్పారు. వెంటనే రక్షణ మంత్రి పుతిన్ తో భద్రతా మండలి టెలికాన్ఫరెన్స్ నుంచి కనిపించారు. అయితే ఒకే ఒక్క క్లిప్పులో మాత్రమే ఆయన టీవీలో కనిపించారు. అతను ప్రత్యేక సైనిక చర్యపై పురోగతిని నివేదించినట్లు వివరించారు. గత నెల 24న రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తూనే ఉంది.

మరో వైపు రష్యా దాడికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అంతే కాకుండా అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉక్రెయిన్ పక్కనే ఉన్న పోలాండ్ కి వెళ్లి అమెరికా ఆర్మీ ని కలిశారు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ నేరస్తుడని కామెంట్లు చేశారు. అంతే కాకుండా ఉక్రెయిన్ శరణార్థులను కలిసి వారికి మరొక బిలియన్ డాలర్లను తన వంతు సాయంగా అందించారు. అలాగే క్రెమ్లిన్ కూడా శుక్రవారం తన ప్రణాళిక లో మార్పు ను ధృవీకరించినట్లు కనిపించింది.

రష్యన్ జనరల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ కల్నల్ జనరల్ సెర్గీ రుడ్స్ కోయ్ మాట్లాడుతూ.. మొదటి దశ ప్రచారం ప్రధాన లక్ష్యం, ఉక్రెయిన్ పోరాట సామర్థ్యాన్ని తగ్గించడం వంటివి చేశామని పేర్కొన్నారు. అలాగే ఆ తర్వాత రష్యా సైన్యం లక్ష్యం డాన్ బాస్ స్వేచ్ఛపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అంతే కాకుండా ఉక్రెయిన్ తూర్పు వైపున ఉన్న డాన్ బాస్ పారిశ్రామిక నగరం... పెద్ద సంఖ్యలో రష్యన్ మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. రష్యా మద్దతు ఉన్న వేర్పాటు వాదులు 2014 నుంచి డాన్ బాస్ లో ఉక్రేనియన్ దళాలతో పోరాడుతున్నారు.