Begin typing your search above and press return to search.

విశాఖ ఘోరాలు: నాడు 60మంది సజీవదహనం

By:  Tupaki Desk   |   10 May 2020 12:30 AM GMT
విశాఖ ఘోరాలు: నాడు 60మంది సజీవదహనం
X
విశాఖపట్నం దారుణాలకు వేదికగా ఉంది. పరిశ్రమలు, అభివృద్ధి యజ్ఞంలో ప్రజల రక్తతర్పణం ఉంది. వారి పోయిన ప్రాణాలున్నాయి. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది చనిపోయారు. ఎంతోమంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ మాయని గాయాలు కొన్నేళ్లుగా విశాఖను వెంటాడుతూనే ఉన్నాయి. విశాఖలో పరిశ్రమలు వేసిన కాటుకు ఎంతో మంది బలైపోతూనే ఉన్నారు. ఒక్కసారి చరిత్ర తవ్వి చూస్తే...

అది 1997 సెప్టెంబర్ 14. విశాఖలోని హెచ్.పీ.సీ.ఎల్ పెట్రోలియం గ్యాస్ పరిశ్రమ. ఈ పరిశ్రమ స్పియర్స్ లోకి నౌక ద్వారా వచ్చిన గ్యాస్ ను లోడింగ్ చేశారు. అనంతరం స్పియర్ దిగువన వాల్వుగ్యాస్ లీక్ కావడంతో పరిశ్రమ మొత్తం వ్యాపించింది. అది గుర్తించని ఓ ఉద్యోగి క్యాంటీన్ లోకి వెళ్లి స్టవ్ అంటించాడు. అంతే భారీ విస్ఫోటనం.. ఈ ఘటనలో 60 మంది సజీవ సమాధి అయ్యారు. ఐదురోజులు గడిచినా మంటలు అదుపులోకి రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శవాలు కాదు కదా.. కనీసం మృతదేహాల ఎముకలు కూడా లభించనంత ఘోరకలి చోటుచేసుకుంది.

ఈ ఘటన తర్వాత గ్యాస్ నిల్వలో మార్పులు చేశారు. భూగర్భంలో గ్యాస్ ను నిల్వ చేస్తున్నారు. సముద్రం వరకు పైప్ లైన్ వేసి సముద్రం సమీపంలోనే ఫిల్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా భవిష్యత్ లో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు.

*విశాఖ ఉక్కు పేలుడులో 19మంది బలి
ఇక విశాఖలోనే మరో ఘటనలో 19మంది బలైపోయారు. 2012 జూన్ 13న విశాఖ స్టీల్ ప్లాంట్లో గ్యాస్ ప్రెజర్ వల్ల సంభవించిన అగ్ని ప్రమాదంలో 19మంది మృతిచెందారు.

ఇలా విశాఖ చరిత్రలో ఎన్నో ప్రమాదాలు.. వాటి వల్ల కోల్పోయిన ప్రాణాలున్నాయి. ఆ తీరని శోకాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. గుర్తుకు తెస్తున్నాయి. విశాఖ గ్యాస్ లీక్ ఘటనతో మరోసారి బయటకొస్తున్నాయి.