Begin typing your search above and press return to search.
గుప్పెడు గుండె పై కోవిడ్ ప్రభావం.. అశ్రద్ధ చేస్తే అంతే సంగతులు
By: Tupaki Desk | 23 Feb 2022 5:38 AM GMTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని అన్ని రకాలుగా దెబ్బతీస్తోంది. ఇప్పటి వరకు ఎంతో మంది మహమ్మారి బారిన పడ్డారు. అయితే వైరస్ విజృంభించిన తొలి నాళ్లలో... కరోనా శరీరంలో ఉన్నంతసేపు ప్రమాదకరంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా అనేకానేక ముప్పులు వాటిల్లుతున్నాయి. పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో గుండె సమస్యలతో మరణిస్తున్నవారి సంఖ్య అధికంగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన వారే అందుకు సాక్షులని అభిప్రాయపడుతున్నారు.
శరీరంలోకి వైరస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అది ఎక్కువ ప్రభావం చూపే అవయవాలు ఊపిరితిత్తులు, గుండె అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయాసం, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం పొందిన తర్వాత లంగ్స్ పై పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదని అంటున్నారు. అయితే ఊపిరితిత్తులలోని సమస్యలను ముందుగానే గుర్తించగలుగుతున్నామని... గుండె పనితీరు మాత్రం ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నామని ప్రముఖ కార్డియాలజిస్ట్ తెలిపారు.
కరోనాకు ముందు 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చే గుండె సమస్యలు.. పోస్ట్ కోవిడ్ కాలంలో 30 ఏళ్ల వారికే వస్తున్నాయని తెలిపారు. గుండె సమస్యలు 70 ఏళ్లు పైబడిన వారిలో 30 శాతం వచ్చేవని.. 60 ఏళ్లు పైబడిన వారిలో 20 శాతం మందిలో వచ్చేవని గుర్తు చేశారు. కానీ ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు వస్తున్నాయని... అంతేకాకుండా ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని వివరించారు.
కరోనా నుంచి బయటపడిన తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. కొందరిలో గుండె కొట్టుకోవడంలో మార్పు, హార్ట్ పంపింగ్ తగ్గిపోవడం, హార్ట్ ఎటాక్, ఆకస్మిక మరణాలు, పెరాలసిస్ వంటి తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.
జన్యుపరమైన సమస్యలతో పాటు కరోనా ప్రభావం వల్ల ఈ సమస్యలు తీవ్రమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు బీపీ, షుగర్ వంటి సమస్యలు వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేవని గుర్తు చేశారు. కానీ కరోనా పుణ్యమా అని చిన్న వయసు వారికి ఈ దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయని వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పరీక్షలు చేయించుకోవాలని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. గుండె పని తీరుపై పరీక్షలు చేయించుకుంటే మంచిదని అంటున్నారు. అంతేకాకుండా పౌష్టికాహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత చాలా అవసరమని చెబుతున్నారు. శరీరానికి తగినంత విశ్రాంతి చాలా అవసరమని నొక్కి చెబుతున్నారు.
వీటిలో ఏదైనా లోపిస్తే హృద్రోగ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో గుండె సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమని నొక్కి చెబుతున్నారు. అశ్రద్ధ వహితే అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు.