Begin typing your search above and press return to search.
పంజాబ్ పంచాయితి లో తప్పు వీళ్ళదేనా ?
By: Tupaki Desk | 9 Jan 2022 12:30 AM GMTపంజాబ్ పంచాయితిలో రోజు రోజుకు హీటు పెరిగిపోతోంది. తప్పు మీదంటే కాదు మీదే అంటు నెపాన్ని ఒకరి మీద ఒకరేసుకుంటున్నాయి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు. పనిలో పనిగా రాజకీయంగడా లబ్దిపొందేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీనే పాకులాడటం చాలా చీపుగా ఉంది. సురక్షితంగా బయటపనిచ్చినందుకు చాలా థ్యాంక్సంటు మోడీ చేసిన ట్వీట్ ఘటన నుండి లబ్దిపొందేందుకు పాకులాడటంలాగనే కనిపిస్తోంది.
ఎలాగంటే ఏదో తనపై దాడి జరిగితే అందులో నుండి సురక్షితంగా బయటపడినట్లుంది మోడీ వైఖరి. అక్కడ దాడి జరిగింది లేదు, అందులో నుండి మోడీ బయటపడిందీ లేదు. ఫ్లైఓవర్ మీద 20 నిముషాలు మోడీ కాన్వాయ్ ఆగిపోయిందంతే. నిజంగా ఇది భద్రతా లోపమనటంలో సందేహం లేదు. అయితే దీనికి ఎవరిది బాధ్యత అనేదే కీలకం. సరే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యాన్ని పక్కన పెట్టేద్దాం. అయితే ఇక్కడ కొట్టొచ్చినట్లు కనబడతున్న తప్పు ఎస్పీజీదే.
ప్రధానమంత్రి భద్రతను చూడాల్సిన బాధ్యత ఎస్పీజీదే. ప్రధాని ఎలా ప్రయాణించాలి, పాల్గొనే సమావేశాలు, వేదిక, ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధంగా ఉంచుకోవటం, రోడ్డు భద్రత లాంటి అనేక అంశాలను చూసుకోవాల్సింది ఎస్పీజీనే. ఈ మొత్తంలో ఎస్పీజీ విఫలమైందనే వాదన మొదలైంది. ఎలాగంటే హెలికాప్టర్లో ప్రయాణించే అవకాశం లేని కారణంగా మోడీ రోడ్డు మార్గం లో బయలుదేరారు. మోడీ ప్రయాణించాల్సిన దూరం 110 కిలోమీటర్లు. అంత దూరాన్ని మోడీని కారులో తీసుకెళ్ళాలని అనుకోవటమే ఎస్పీజీ తప్పు.
అలాగే ప్రధాని ప్రయాణానికి మామూలు బుల్లెట్ ప్రూఫ్ కారు ఫార్చ్యూనర్ ను వాడారట. దీనికి రాకెట్ లాంచర్లను తట్టుకునేంతీ సీన్ లేదట. పైగా ఫ్లై ఓవర్ మీద టార్గెట్ రీచయ్యేట్లుగా ప్రధానిని 20 నిముషాల పాటు ఓపెన్ గా ఉంచేయటం కూడా ఎస్పీజీ తప్పే అంటున్నారు. ఎప్పుడైతే వాతావరణం బాగా లేదని తేలిందో, 110 కిలోమీటర్లు ప్రయాణించాలని చెప్పారో వెంటనే ప్రోగ్రామ్ ను రద్దు చేయాల్సిన ఎస్పీజీ ఆపని చేయకపోవటం తప్పేనని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే ఎస్పీజీది చాలా తప్పులే కనబడుతున్నాయి. మరి ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిందే.