Begin typing your search above and press return to search.
చల్లని యూరప్ లో హీట్ వేవ్.. జనం ఏంచేస్తున్నారంటే?
By: Tupaki Desk | 21 July 2022 2:30 AM GMTవేసవి కాలం 40 డిగ్రీల ఎండ.. మనకు తక్కువే.. 45 దాటితేనే మనం వామ్మో అంటాం.. కానీ, వారికి వేసవిలో అయినా ఎప్పుడో కానీ 40 డిగ్రీలు ఉండదు. అది కూడా చరిత్రలో ఒకటో రెండోసారో. కానీ, ఇప్పుడా సందర్భం వచ్చింది. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉబ్బ తట్టుకోలేక నదుల్లో దూకుతున్నారు. ఇదంతా యూరప్ లో జరుగుతోంది. స్పెయిన్ మొదలుకుని ఇంగ్లండ్ వరకు హీట్ వేవ్ వణికిస్తోంది. ఎన్నడూ లేనంతగా కార్చిచ్చు అడవులను కమ్మేస్తోంది.
శీతలం పోయి ఉష్ణోగ్రతలు..
యూకే శీతల దేశం. మొత్తం యూరప్ కూడా అంతే. వారికి జూన్, జూలై, ఆగస్టు వేసవి కాలం. అందుకే క్రికెట్ మ్యాచ్ లు ఎక్కువగా ఈ కాలంలోనే జరుగుతుంటాయి. అలాంటి యూకేను మండుటెండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రసిద్ధ విమానాశ్రయం లండన్ లోని హీత్రూ ప్రాంతంలో మంగళవారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇప్పటివరకు రికార్డు. కౌంటీల్ల చూస్తే సర్రేలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే యూకేలో వాతావరణ రికార్డుల నమోదు మొదలుపెట్టినప్పటి నుంచి ఇవే టాప్. దీన్నిబట్టే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, 2019లోనూ హీట్ వేవ్ యూరప్ ను వణికించింది. అప్పుడు నమోదైన ఉష్ణోగ్రత కేవలం 38.7 డిగ్రీలే. అయితే, దీనికే అల్లాడిపోతున్నారు.
పగలే కాదు.. రాత్రిళ్లూ మంట
పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఉంటే దాని ప్రభావం రాత్రిళ్లూ సహజం. అందుకనే లండన్ లో ఇప్పుడు రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎండల దెబ్బకు ప్రజలు చల్లదనం కోసం నదుల్లో, సరస్సుల్లో దూకుతున్నారు. ఇలా ఐదుగురు మరణించారు. సహజంగానే రైలు, విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. ఆలస్యంగా సాగుతున్నాయి.
రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదం
మనదగ్గరంటే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరినా.. తట్టుకునేలా రైలు పట్టాలున్నాయి. కానీ, యూరప్ లో 40 డిగ్రీలకు చేరితే రైల్వే ట్రాక్‌లపై వేడి 50 నుంచి 70 డిగ్రీల వరకు పెరిగిపోతుంది. పట్టాలు వదులై రైలు బోగీలు పట్టాలు తప్పుతాయి. ఇప్పటికే లండన్‌లో రైలు పట్టాల కింద వేసిన కలప దుంగలకు నిప్పంటుకున్నట్లు వార్తలు వచ్చాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న ఎండలను తట్టుకునేలా రైలు పట్టాలు, రోడ్లను మెరుగుపరచడం ఇప్పటికిప్పుడు జరిగే పని కాదని, అందుకు కొంత కాలం పడుతుందని అధికారులు చెబుతున్నారు. వడదెబ్బకు గురైనవారిని వేగంగా ఆస్పత్రులకు తరలించడానికి అంబులెన్సులను, ఆస్పత్రి పడకలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు దేశమంతటా పాఠశాలలను వేసవి సెలవులకన్నా ముందే మూసివేస్తున్నారు. పెరిగిపోతున్న దాహార్తి తీర్చుకోవడానికి జనం నీటి వాడకాన్ని పెంచడంతో పైపుల్లో నీటి ప్రవాహ ఒత్తిడి తగ్గిపోతోంది.
వాతావరణ మార్పుల వల్ల చలి దేశాలు కూడా వేడి కొలిమిలా మారిపోతున్నాయి. బ్రిటన్ మొత్తంగా మంగళవారం రికార్డు స్థాయిలో 39.1డిగ్రీల సెల్సియస్ (102.4 ఫారన్‌హీట్) ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సౌత్ లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి సమీపంలో చార్ల్‌వుడ్ సర్రేలో ప్రాథమికంగా ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బ్రిటన్‌లో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 38.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉండేది. 2019 జులై 25న కేంబ్రిడ్జి బోటానిక్ గార్డెన్‌లో ఈ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వారంలో భారీ ఉష్ణోగ్రతలు (41డిగ్రీల సెల్సియస్) నమోదయ్యే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అత్యంత తీవ్రమైన వేడి ఉంటుందని, ముఖ్యంగా రాత్రివేళల్లోనూ వేడి కొనసాగుతుందని హెచ్చరించారు.
నగరప్రాంతాల్లో నివసించేవారు ఈ ఉష్ణ ప్రభావానికి గురవుతారని తెలిపారు. వడగాడ్పులతో పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలతో పౌరులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉపశమనం పొందేందుకు బీచ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. అత్యంత అరుదుగా సంభవించే ఈ వడగాడ్పులు ఇప్పటికే ఇంగ్లాండ్‌తో పాటు వేల్స్‌లోని పలు ప్రాంతాలను తాకినట్టు వాతావరణ శాఖ ఇటీవల తెలిపింది. ఒకవేళ అదే జరిగితే ప్రజలు అనారోగ్యం బారిన పడటంతో పాటు ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని బ్రిటన్‌ఆరోగ్య విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్‌కు చేరితే వాతావరణ అత్యయిక స్థితి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.