Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్టులా.. చేపల మార్కెట్లా? రద్దీతో జనాలకు ఇబ్బందులు

By:  Tupaki Desk   |   13 Dec 2022 2:30 PM GMT
ఎయిర్ పోర్టులా.. చేపల మార్కెట్లా? రద్దీతో జనాలకు ఇబ్బందులు
X
జనాలు సుఖానికి ఎగబడ్డారు. రోజంతా పట్టే ట్రైయిన్ లో వెళ్లేబదులు గంట సమయం పట్టే విమానంలో వెళితే ఈజీగా చేరుకోవచ్చని భావిస్తున్నారు. సమయానికి సమయం.. శారీరక శ్రమ తప్పుతుందని ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అయితే జనాల మారిన ఈ ధోరణితో విమానయాన సంస్థలు పండుగ చేసుకుంటుండగా.. ప్రయాణికుల రద్దీ ఊహించని ఎయిర్ పోర్టులు జనాలతో నిండిపోతున్నాయి.

తాజాగా ఢిల్లీ, ముంబై ఎయిర్ పోర్టులు ప్రయాణికులతో నిండి పోయాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అయితే పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ప్రయాణికులు 4 నుంచి 5 గంటల సమయం వేచిచూడాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటోంది. ఎయిర్ పోర్టులో పరిస్థితిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు మీమ్స్ తో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఢిల్లీ , ముంబై ఎయిర్ పోర్టులో విమానం ఎక్కేందుకు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. దీంతో వారంతా ఎయిర్ పోర్టులో ఆపసోపాలు పడాల్సి వస్తోంది. గంటలకొద్దీ వెయిటింగ్ చేయాల్సి వస్తోందని ప్రయాణికుల నుంచి కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికి తోడు ఢిల్లీ ఎయిర్ పోర్టులోని ఓ భాగంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. ఈ విషయం తెలియని వారు విమానం మిస్ చేసుకొని ఇక్కట్లు పడుతున్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టు పరిస్థితి అయితే చేపల మార్కెట్ కంటే అధ్వానంగా తయారైందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ‘ఇండిగో ఎయిర్ లైన్స్’ తన ప్రయాణికులకు సూచనలు చేసింది. డొమెస్టిక్ ప్రయాణికులు కనీసం మూడున్నర గంటల ముందు రావాలని.. 7 కిలోల బరువుంటే ఒకే బ్యాగ్ తో వస్తే సెక్యూరిటీ క్లియరన్స్ త్వరగా లభిస్తుందని పేర్కొంది. ఎయిర్ పోర్టు లోపల టెర్మినల్ 3కి చేరుకునేందుకు గేట్ నంబర్ 5, గేట్ నంబర్ 6 మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.

మరోవైపు ఎయిర్ పోర్టుల్లో పరిస్థితిపై నెటిజన్లు మీమ్స్ తో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ విమానాశ్రయానికి వచ్చేకంటే రైల్లో వెళ్లేది ఉత్తమం అని ట్వీట్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.