Begin typing your search above and press return to search.
కాంగ్రెస్‌కు సర్జరీ అవసరం బాస్.. పొలిటికల్ టాక్!
By: Tupaki Desk | 7 Nov 2022 7:30 AM GMTమునుగోడు ఉపపోరులో కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిటైనా దక్కకపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి.. బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థులతో సరిసమానంగా ప్రచారం నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా రాష్ట్రస్థాయి ముఖ్యనేతలంతా అక్కడ హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. గెలుపు తమదేనని, కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ ఓటింగ్ పడుతుందని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతుండడం అదనపు బలమనుకున్న ఆ పార్టీ నేతల లెక్కలన్నీ తప్పాయి. అనూహ్య విజయం దక్కుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావించినా.. జీర్ణించుకోలేని ఓటమిని మూటగట్టుకో వాల్సి వచ్చింది.
రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత సహకరించకపోతే మాత్రం మరీ డిపాజిట్ కూడా దక్కించుకోలేనంత వైఫల్యానికి కారణం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇప్పటికే పలు ఉపఎన్నికల్లో పరాజయాలను మూటగట్టుకున్న కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని తాజా ఓటమి మరింత కుంగదీసింది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో కొనసాగుతున్న సమయంలో ఎదురైన ఈ ఫలితం మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా రు.
ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు, నేతల పక్కచూపులతో సతమతమవుతున్న కాంగ్రెస్.. తాజా పరిస్థితులతో ఇంకెంత కంగారు పడాల్సి ఉంటుందోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పైగా.. టీపీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డికి మునుగోడు ఫలితం కాంగ్రెస్ భవితవ్యంపై ఆందోళన కలిగించే పరిణామమే నని చెప్పక తప్పదు. మరి కాంగ్రెస్ పార్టీకి వరుసగా తగులుతున్న ఈ ఎదురుదెబ్బలను తట్టుకుని తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎలా పుంజుకుంటుందో చూడాలి. కనీసం ఇప్పటికైనా.. కఠిన నిర్ణయాలు తీసుకుని నాయకులను లైన్లో పెడతారో.. లేక.. అయిందేదో అయిపోయిందని.. నిమ్మళంగా వ్యవహరిస్తారో చూడాలి. ఏదేమైనా.. కాంగ్రెస్‌కు సర్జరీ అవసరమనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.