Begin typing your search above and press return to search.
ఉత్తరప్రదేశ్ లో పోలీసు పోస్టుల్లో భారీగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు
By: Tupaki Desk | 13 Jun 2022 11:30 AM GMTఉత్తర ప్రదేశ్ పోలీసు విభాగంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగులుగా చేరారు. ఆ రాష్ట్రంలో 1,477 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు పోలీసులుగా మారారు. టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇంత మంది అభ్యర్థులు పోలీసు విభాగంలో ఎంపిక కావడం ఇదే తొలిసారి. విశేషమేమిటంటే.. ఎంపికైనవారిలో 125 మంది అభ్యర్థులు BCA డిగ్రీ హోల్డర్లు, 43 మంది BBA చేసినవారు ఉన్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్లు, తత్సమాన ర్యాంక్‌ల అధికారులను నియమించే ఈ అతిపెద్ద డ్రైవ్‌లో రాష్ట్ర ప్రభుత్వం 9,534 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది, అందులో 1,477 మంది టెక్కీలు ఉన్నారు.
మొత్తం పోస్టుల్లో 9,027 మంది సివిల్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా, 484 మంది పీఏసీలో ప్లాటూన్ కమాండర్లుగా, 23 మంది అగ్నిమాపక శాఖలో ఫైర్ సబ్ స్టేషన్ ఆఫీసర్లుగా చేరనున్నారు. పోలీసు శాఖలో యువతకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 100 రోజుల ప్రచారానికి అనుగుణంగా, నిర్ణీత సమయానికి ముందే 10,000 ఉద్యోగాల నియామక లక్ష్యాన్ని పూర్తి చేశామని అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) అవనీష్ అవస్తీ తెలిపారు.
రాష్ట్రానికి 1,805 మంది మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్లు కూడా వస్తారని, ఇది మహిళా సాధికారతతో పాటు మహిళల భద్రత మరియు ప్రయోజనాల పరంగా చారిత్రాత్మక విజయం అని ఆయన అన్నారు. కారుణ్య ప్రాతిపదికన మొత్తం 500 మంది అభ్యర్థుల నియామకం కూడా జరిగిందని ఆయన తెలిపారు.
ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ డైరెక్టర్ జనరల్, R.K. విశ్వకర్మ మాట్లాడుతూ గతంలో అత్యధికంగా 1,000 లేదా 1,500 సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులను సృష్టించామని, అయితే మొదటిసారిగా 9,534 పోస్టులను భర్తీ చేశామని చెప్పారు.
కాగా నవంబర్ 12 నుండి డిసెంబర్ 2, 2021 వరకు జరిగిన ఆన్‌లైన్ పరీక్షకు 12.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏప్రిల్‌లో ఫలితాలు ప్రకటించారు. మేలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగింది అని ఆయన చెప్పారు. మొదటిసారిగా తాము సాంకేతిక నైపుణ్యాలు ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఎస్ఐలుగా పొందగలిగామని వెల్లడించారు.
పోలీసు ఉద్యోగాలకు ఎంపికైనవారిలో 60 శాతం మంది 21-25 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా 2017లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ పోలీసులు వివిధ హోదాల్లో 1.75 లక్షల మంది పోలీసులను తమ విభాగాల్లో నియమించుకున్నారు.