Begin typing your search above and press return to search.

కెంటకీపై టోర్నడో భారీ దెబ్బ: ఇళ్లు, భవనాలు నేలమట్టం..

By:  Tupaki Desk   |   13 Dec 2021 3:01 PM IST
కెంటకీపై టోర్నడో భారీ దెబ్బ: ఇళ్లు, భవనాలు నేలమట్టం..
X
ఎటు చూసినా నేలకూలిన ఇళ్లు.. కొట్టుకు వచ్చిన కార్లు.. వస్తువులన్నీ విసిరిపారేసినట్లుగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూస్తే ఆందోళన కలుగుతోంది. అమెరికాలో టోర్నడో సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు.

టోర్నడో ధాటికి అమెరికాలోని కెంటకీ పూర్తిగా ధ్వంసమైంది. ఎన్నడూ చూడలేనంతగా బీతావహ పరిస్థితి ఏర్పడడంతో.. ఇది యుగాతం సినిమానా..? అన్న విధంగా చర్చించుకుంటున్నారు. ఇక టోర్నడో భీభత్సానికి చనిపోయిన వారి సంఖ్య లెక్కలేకుండా పోయింది.

ఇప్పటి వరకు 110 అని అధికారిక లెక్కలు చెబుతున్నా.. వాస్తవానికి ఇంకా ఎక్కవే ఉంటుందని అనుకుంటున్నారు. భీకరమైన గాలులతో పునాదులతో సహా ఇళ్లు కొట్టుకుపోయాయి. అందులో ఉన్నవారు సైతం ఈ విధ్వంసంలో చిక్కుకొని ఎక్కడికి ఎగిరిపడ్డారో తెలియని పరిస్థితి నెలకొంది.

అమెరికాలోని ఆర్కాన్సాస్, ఇల్లినాయస్, కెంటకీ, మిస్సోరీ, టెన్నెసీ రాష్ట్రాల్లో అకస్మాత్తుగా సంభవించిన టోర్నడోలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రాణ, ఆస్తి నష్టాన్ని భారీగా మిలిల్చాయి. వీటిలో కెంటకీలో విధ్వంసం భారీగా జరిగింది. దీంతో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అమెజాన్ కు చెందిన భారీ గోడౌన్ టోర్నడో దాడికి పూర్తిగా దెబ్బతిన్నది. ఇందులోని వస్తులు నేలలో కూరుకుపోవడం చూస్తే ఎంతటి భయానకర వాతావరణం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక కెంటకీలో 320 కిలోమీటర్ల పొడవునా భారీ టోర్నడో సంభవించిన్టలు అధికారులు తెలుపుతున్నారు. ఒక్క కెంటకీలోనే 80 మంది వరకు మరణించారని తెలుపుతున్నారు.

కెంటకీ చరిత్రలోనే ఇది భారీ విధ్వంసంగా పేర్కొంటున్నారు. ఎప్పుడూ ఇంతటి ఘోరాన్ని చూడలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఒక రకంగా ఇది యుగాంతం సినిమాలోని క్లైమాక్స్ సీన్స్ కనిపిస్తున్నాయని మీడియాలో కొందరు పేర్కొంటున్నారు. ఇక ఈ నగరంలోని మేఫీల్డ్ సిటీలోని క్యాండిల్ ఫ్యాక్టరీ పైకప్పు గాలికి లేచిపోయింది.

ముందుగా ఈదురు గాలులు వచ్చినట్లుగా అనిపించి ఒకేసారి టోర్నడో సంభవించడంతో పెద్ద బాంబు పేలినట్లు అయిందని స్థానికులు తెలుపుతున్నారు. టోర్నడో దెబ్బకు ఇప్పుడు మూడు లక్షల మందికి విద్యుత్ లేకుండా పోయింది.

టోర్నడోలో చిక్కుకున్న మృతదేహాలను అధికారులు సేకరించి వాటిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. మరికొన్ని వాటికోసం గాలిస్తున్నారు. ఇక టోర్నడో దెబ్బకు ఇళ్లు, ఆస్తులు కోల్పోయి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. మరికొంత మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు.

బలమైన గాలులకు ఇళ్లు పునాదులతో సహా కొట్టుకుపోయాయి. పెద్ద పెద్ద భవనాలు సైతం గోడలు లేకుండా కుప్పకూలిపోయాయి. కాగా అధికారులు భవానాల శిథాలలను తొలగిస్తున్నారు. మైఫీల్డ్ ఫ్యాక్టరీలో చిక్కుకున్న 40 మందిని సహాయక బృందాలు కాపాడాయి. మరికొంతమందిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

అమెరికా చరిత్రలోనే ఇంత పెద్ద విధ్వంసం ఎన్నడూ చూడలేదని పలువురు పేర్కొంటున్నారు. యూఎస్ లో టోర్నడోలు కొత్త కాదు. కానీ ఈసారి మాత్రం భారీ విధ్వంసాన్నే సృష్టించింది. టోర్నడో సృష్టించిన నగరాల్లో ఎక్కడ చూసినా కుప్పకూలిన ఇళ్లు.. ధ్వంసమైన భవనాలే దర్శనమిస్తున్నాయి.

అంతేకాకుండా టోర్నడోలో చిక్కుకొని ఇంత ప్రాననష్టం జరగడంపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇక బలమైన గాలులకు కొట్టుకుపోయిన వారి కోసం సహాయక బృందాలు వెతికే పనిలో పడ్డాయి.