Begin typing your search above and press return to search.
భారీ వర్షాలు.. అక్కడ మళ్లీ రెడ్ అలర్ట్!
By: Tupaki Desk | 23 July 2019 8:32 AM GMTగత ఏడాది భారీ వర్షాలతో ముప్పుతిప్పలు పడ్డారు కేరళ ప్రజలు. అయితే వారికి ఈ సారి కూడా అలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేరళలో పుష్కలమైన వానలు కురుస్తూ ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు అక్కడ చాలా యాక్టివ్ గా ఉన్నాయిప్పుడు.
కేరళతో పాటు కర్ణాటకలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో కూడా వర్షాలు బాగా కురుస్తూ ఉన్నాయి. ఏపీ - తెలంగాణల్లో ఇంకా వర్షపాత లోటు చాలానే ఉంది. అయితే ఆకుపచ్చని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు బ్రహ్మాండంగా పడుతూ ఉన్నాయి.
కేరళను ఇప్పటికే భారీ వర్షాలు చుట్టుముట్టాయి. అక్కడ మరింత భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ వర్గాలు చెబుతూ ఉండటం గమనార్హం. రోజుకు కనీసం ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది!
ఒక్క రోజులో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది అత్యంత భారీ వర్షపాతమే అని చెప్పవచ్చు. ఇప్పటికే భారీ ఎత్తున అక్కడ నివాస ప్రాంతాలను కూడా నీళ్లు చుట్టుముట్టాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి.
ఇలాంటి సమయంలో రానున్న రోజుల్లో రోజుకు ఇరవై సెంటీమీటర్ల స్థాయి వర్షపాతం నమోదు అయితే అచ్చం గత సంవత్సరం తరహా పరిస్థితులు ఉత్పత్నం అవుతాయనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి అక్కడి ప్రజల్లో. గత సంవత్సరం కేరళను భారీ ఎత్తున వరదలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు భారీ స్థాయిలో నష్టం కూడా సంభవించింది. అక్కడి ప్రజలకు అప్పుడు తినేందుకు తిండి దొరకడం కూడా కష్టం అయ్యింది. మళ్లీ అలాంటి పరిస్థితి అంటే.. అక్కడి ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.