Begin typing your search above and press return to search.

సౌదీలో వరదలు..కారణం ఆశ్చర్యకరం

By:  Tupaki Desk   |   24 Feb 2017 4:58 PM GMT
సౌదీలో వరదలు..కారణం ఆశ్చర్యకరం
X
గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియా ఊహించని సంతోషాన్ని పొందుతోంది. సౌదీ ఎడారి ప్రాంతమనే సంగతి తెలిసిందే. వర్షాల్లేక అల్లాడిపోతున్న కరువు నేల. 110 ఫారిన్‌ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే దుబాయ్‌ లో వర్షపాతం కేవలం 127 మిల్లీమీటర్లు! యూఏఈలోని అన్ని నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే యూఏఈ గత ఏడాదే ఒక బృహత్తర ప్రాజెక్ట్‌ ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఎడారి రాజ్యంలో వర్షాలను కురిపించే మేఘాలను సృష్టించడానికి భారీ పర్వత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు మీద 4 లక్షల డాలర్లు ఖర్చు పెడుతోంది. ఇప్పటికే క్లౌడ్ సీడింగ్ పద్ధతి ద్వారా యూఏఈలో కృత్రిమ వర్షాలను సృష్టిస్తున్నారు. అటు ఆర్కిటిక్ నుంచి మంచుకొండలు కరిగి ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ప్రయత్నాల ఫలితంగా సౌదీలో గత కొద్ది రోజులుగా మంచి వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో సౌదీ అరేబియా వాసుల్లో పట్టరాని ఆనందం నెలకొంది. అంతే కాదు ప్రయోగాన్ని మిగతా గల్ఫ్ దేశాలు కూడా అధ్యయనం చేస్తున్నాయట. తమ ఇలాకాలోనూ ఇదే రీతిలో మేఘమథనం చేయాలని ఆయా దేశాలు సౌదీని సంప్రదిస్తున్నట్లు చెప్తున్నారు.

మరోవైపు అమెరికాలోని కాలిఫోర్నియా సైతం ఈ తరహా వార్తలతో తెరమీదకు వచ్చింది. కాలిఫోర్నియాలో ఎడారులు బండ రాళ్లు, ఎత్తయిన పర్వత శ్రేణులతో నిండి ఉంటాయి. ఇక్కడ ఒకింత భిన్నమైన వాతావరణం ఉంటుంది. మిగతా ఎడారి ప్రాంతాలతో పోలిస్తే కాలిఫోర్నియాలో వర్షపాతం చాలా తక్కువ. వర్షాలు కురిపించే మేఘాలను ఎత్తయిన పర్వతాలు అడ్డుకోవడం వల్ల ఈ ప్రాంతం డ్రై ఏరియాగా మారింది. మొజావే ఎడారిలో ఏటా 76 నుంచి 254 మిల్లీమీటర్లు, కొలరాడో ఎడారిలో 51 నుంచి 152 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే పడుతుంది. అలాంటిదిప్పుడు కాలిఫోర్నియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏళ్ల తరబడి కరవుతో అల్లాడిన కాలిఫోర్నియా ఎడారులు జలకళను సంతరించుకుంటున్నాయి. 50 ఏళ్ల తర్వాత తొలిసారి ఓవర్ విల్లే డ్యామ్ నిండుకుండలా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/