Begin typing your search above and press return to search.
విడవని వర్షం.. తెలంగాణలో వచ్చే 2 రోజులు భారీ వర్షాలు పక్కానట
By: Tupaki Desk | 8 Aug 2022 3:22 AM GMTమంటలు పుట్టిస్తూ.. ఎప్పుడెప్పుడు వెళ్లిపోతుందన్నట్లుగా ఉంటుంది మండే ''మే''. మే చివరకు వచ్చేసరికి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటం.. జూన్ మొదటి వారంలో చినుకులతో ఎంట్రీ ఇచ్చి.. మరిన్ని రోజులు వర్షాలు పడుతుంటాయి.
ఈసారి అందుకు భిన్నంగా జూన్ లో వర్షం జాడే లేని పరిస్థితి. జులై వచ్చే వరకు వర్షం పడని వైనంతో.. ఈసారి వర్షాలు తక్కువగా ఉంటాయా? అన్న సందేహం రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది. అందుకు భిన్నంగా మొదలైన వర్షం.. విడవకుండా వర్షం మీద వర్షం అన్నట్లుగా సాగుతోంది.
ఒక్క జులై విషయాన్నే తీసుకుంటే.. మొత్తం నెలలో 20 రోజులకు పైనే వర్షాలు కురిసాయంటే ఎంత ఎక్కువన్నది ఇట్టే అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఏకంగా వందేళ్లకు పైగా అత్యధిక వర్షపాతం రికార్డులు సైతం తుడిచిపెట్టుకు పోయినట్లుగా చెబుతున్నారు. ఆగస్టు లోఇప్పటికే వారం రోజులు గడిచిపోయినా.. నేటికి వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా అందుతున్న వాతావరణ సమాచారం ప్రకారం.. వచ్చే రెండు రోజులు వర్షం గండం తప్పేట్లు లేదంటున్నారు.
పెళ్లిళ్ల సీజన్ కావటం.. శుభ కార్యాలకు మంచిరోజులు తక్కువగా ఉండటం.. మళ్లీ గ్యాప్ వచ్చే వీలు ఉండటంతో.. పెద్ద ఎత్తున పెళ్లిళ్లు.. పలు శుభకార్యాలు వరుస పెట్టి జరుగుతున్నాయి. ఇలాంటి వారికి వర్షం చుక్కలు చూపిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమైనట్లు చెబుతున్నారు. ఈ కారణంగా ఒడిశా.. ఉత్తరాంధ్ర తీరంపైన ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం ఖాయమంటున్నారు.
అల్పపీడనం కారణంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించినట్లు చెబుతున్నారు. దీంతో సోమ.. మంగళవరాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి వర్షం చిక్కులే ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. బీకేర్ ఫుల్.