Begin typing your search above and press return to search.
తొలకరి పలకరింత: తడిసి ముద్దయిన హైదరాబాద్
By: Tupaki Desk | 31 May 2020 12:09 PM GMTరెండు వారాలుగా తీవ్రరూపం దాల్చిన ఎండలతో ఉక్కిరిబిక్కరైన తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుని ఆహ్లాదకరణ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు మబ్బులు అలుముకున్నాయి. దాదాపు అర్థగంట సేపు భారీ వర్షం కురిసింది. దీంతో భాగ్యనగరమంతా తడిసి ముద్దయ్యింది. దీంతో ప్రజలంతా ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ఎండ వేడిమి పోయి ప్రశాంత వాతావరణం ఏర్పడడంతో ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు.
ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ - దిల్ సుఖ్ నగర్ - హయత్ నగర్ - మలక్ పేట - సంతోశ్ నగర్ - అబిడ్స్ - కోఠి - రాంనగర్ - బంజారాహిల్స్ - ఉప్పల్ - ఘట్ కేసర్ - మోహిదీపట్నం - జీడిమెట్ల - మాదాపూర్ - పంజాగుట్టలలో వర్షం కురింది. ఈ వర్షంతో వేసవి తాపం నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.
ఇదే మాదిరి 48 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు - మెరుపులు - ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దాని ప్రభావంతో వర్షాలు పడతాయని వివరించింది.