Begin typing your search above and press return to search.

షుగర్ నియంత్రణ.. దీనితో సాధ్యమట..!

By:  Tupaki Desk   |   2 Oct 2019 1:44 AM GMT
షుగర్ నియంత్రణ.. దీనితో సాధ్యమట..!
X
35 ఏళ్లు దాటగానే మధుమేహం మనిషిని ఆవరిస్తోంది. వేళా పాలాలేని ఉద్యోగాలు.. జంక్ ఫుడ్.. అతిగా మద్యం తాగడం వల్ల మన శరీర జీవ క్రియ దెబ్బతిని మధుమేహం బారిన పడుతున్నారు. అయితే మధుమేహం నుంచి తప్పించుకోవడం కష్టమే అయినా దాన్ని నియంత్రించడం సులువేనని చెబుతున్నారు.

తాజాగా బ్రిటన్ లోని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు షుగర్ ను తగ్గించేందుకు ఏకైక మార్గం బరువును తగ్గించడమేనని తేల్చారు. మధుమేహం వచ్చిన తొలి ఐదేళ్లలో 10శాతం శరీర బరువును తగ్గించుకోగలిగితే దాని నుంచి తప్పించుకోవడం సాధ్యమేనని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మొత్తం 867 మంది 40-69 ఏళ్ల వారిని ఐదేళ్ల పాటు పరిశీలించి పరిశోధించిన కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు.. ఇందులో బరువు తగ్గిన 257 మంది మధుమేహాం పూర్తిస్థాయిలో తగ్గిందని చెప్పారు. బరువు తగ్గని మిగతా వారిలో షుగర్ పెరిగి చనిపోవడమో.. లేక వ్యాధుల బారిన పడడమో జరిగిందని తేల్చారు. ఇక మధుమేహాన్ని తగ్గించే శక్తి గోధుమరంగు కొవ్వు కణజాలంలో ఉందని శాస్త్రవేత్తల బృందం కనుగొనింది. దీని ఆధారంగా షుగర్ మందును కనుగొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.