Begin typing your search above and press return to search.
అయోధ్య....రగులుతున్న రాముని ఇలాకా
By: Tupaki Desk | 24 Nov 2018 5:17 PM GMTఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామజన్మభూమి మారుమోగిపోతున్నది. అయోధ్యలో వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పటికీ.. రామాలయాన్ని నిర్మించాలన్న డిమాండ్లతో రాజుకున్న రాజకీయ వేడి పట్టణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) - సంఘ్ పరివార్ శక్తులు.. అందులో భాగంగా ఆదివారం అయోధ్య పట్టణంలో 3 లక్షల మందితో ధరమ్ సభ పేరిట భారీ కార్యక్రమానికి రూపకల్పన చేశాయి. మరోవైపు శివసేన కూడా తాము ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించింది. ఇటు ధరమ్ సభ.. అటు శివసేన కార్యక్రమాల నేపథ్యంలో అయోధ్యలో భారీగా భద్రతాదళాలను అధికారులు మోహరించారు. దీంతో ఆధ్యాత్మిక నగరం నివురుగప్పిన నిప్పులా మారింది. కాగా శివసేన కార్యక్రమానికి అనుమతి లేదని అయోధ్య జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం అక్కడికి చేరుకుని సరయూ నదీ తీరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రోజులు - నెలలు - ఏండ్లు - తరాలు కూడా మారాయి. ఆలయాన్ని అక్కడే నిర్మిస్తాం అంటున్నారు. కానీ ఎప్పుడు నిర్మిస్తారో చెప్పడం లేదు. ముందు ఎప్పుడు నిర్మిస్తారో తేదీ ప్రకటించండి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మందిరం విషయంలో బీజేపీ కుంభకర్ణునిలా నిద్రపోతున్నదని.. దానిని నిద్ర లేపడానికి ఉద్ధవ్ థాక్రే అయోధ్య వెళ్లారని శివసేన పత్రిక ‘సామ్నా’ పేర్కొంది. ఇదిలాఉండగా - ఆదివారం నిర్వహించనున్న ధరమ్ సభకు దాదాపు 3 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. ‘చాలాకాలంగా టెంట్ కింద ఉంటున్న భగవాన్ రాముడు.. తన ఆలయ పునరుద్ధరణకు భక్తుల్లో ధైర్యాన్ని ఆకాంక్షిస్తున్నాడు. ఆ క్షణం రానేవచ్చింది. రాముని మూలవిరాట్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నదో అక్కడే మందిరాన్ని నిర్మించి తీరుతాం. అయోధ్య సాంస్కృతి సరిహద్దులో ఎటువంటి మసీదు ఉండరాదు’ అని వీహెచ్ పీ మీడియా విభాగం ఇన్ చార్జి అంబుజ్ ఓఝా పేర్కొన్నారు. మరోవైపు అయోధ్య జిల్లా యంత్రాంగం రామజన్మభూమి ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. హింస జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది మైనార్టీలు పట్టణాన్ని విడిచి వెళ్లిపోతున్నట్టు సమాచారం.
అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో డ్రోన్లను ఉపయోగించి పోలీసులు నిఘాను పర్యవేక్షిస్తున్నారు. ఒక అదనపు డీజీపీ - ఒక డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ (డీఐజీ) - ముగ్గురు సీనియర్ ఎస్పీలు - పదిమంది అదనపు ఎస్పీలు - 21 మంది డిప్యూటీ ఎస్పీలు - 160 మంది ఇన్ స్పెక్టర్లు - 700 మంది కానిస్టేబుళ్లు - 42 కంపెనీల పీఏసీ బలగాలు - ఐదు కంపెనీల ఆర్ ఏఎఫ్ - ఏటీఎస్ కమెండోలు - డ్రోన్ల సహాయంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని పోలీసు అధికార ప్రతినిధి వెల్లడించారు. శివసేన తలపెట్టిన కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని - ధరమ్ సభ కోసం మాత్రం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారని - 13 ప్రాంతాలను పార్కింగ్ కోసం గుర్తించామని అయోధ్య మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ వెల్లడించారు.
మరోవైపు యూపీ మాజీ సీఎం - సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ పరిణామాలపై స్పందించారు. ‘ఉత్తర్ ప్రదేశ్ లోని పరిస్థితులను సుప్రీంకోర్టు సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాలి. అవసరమైతే సైన్యాన్ని అయోధ్య పట్టణంలో మోహరించాలి. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ఎంత దూరమైనా వెళ్లే ప్రమాదం ఉన్నది’ అని పేర్కొన్నారు. కాగా అఖిలేశ్ వ్యాఖ్యలను యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖండించారు.. జరిగేది ధరమ్ సభ అని దానికి ఆర్మీ అవసరం లేదని తెలిపారు. కరసేవకులపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తుచేస్తూ ‘అఖిలేశ్ 1990 నాటి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారేమో.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో అలాంటివి జరుగవు’ అని మౌర్య పేర్కొన్నారు. రామజన్మభూమి వివాదంలో ముస్లిం కక్షిదారుగా ఉన్న ఇక్బాల్ అన్సారీ ధరమ్ సభ నిర్వహణపై మాట్లాడుతూ అయోధ్య ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వాలని కోరారు. ‘వారు (వీహెచ్ పీ నాయకులు) కావాలనుకుంటే లక్నోలోని అసెంబ్లీని లేదా ఢిల్లీలోని పార్లమెంట్ ను ఘెరావ్ చేయవచ్చు. కానీ అయోధ్య ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వండి’ అని అన్సారీ అని సూచించారు.