Begin typing your search above and press return to search.

గుండె ను తీసుకెళుతూ రెండు సార్లు ప్రమాదం.. అయినా ఆ గుండె బతికిందిలా

By:  Tupaki Desk   |   10 Nov 2020 1:30 AM GMT
గుండె ను తీసుకెళుతూ రెండు సార్లు ప్రమాదం.. అయినా ఆ గుండె బతికిందిలా
X
చావాలని రాసిపెట్టి ఉంటే ఇంట్లో ఉన్నా చచ్చిపోతారు. ఈ లోకంలో బతకాలని నూకలు రాసి ఉంటే ఆకాశం నుంచి కిందపడినా బతికిపోతారు. దాన్ని అదృష్టం అంటారు. ఓ రోగి ప్రాణాలు కాపాడడం కోసం చనిపోయిన వ్యక్తి నుంచి గుండెను తీసుకువస్తుండగా.. హెలిక్యాప్టర్ క్రాష్ అయ్యింది. అయినా ఆ గుండెకు ఏం కాలేదు. ఆ గుండెను తీసుకొచ్చిన బాక్స్ తీసుకొని వెళుతుండగా వైద్యుడు కిందపడిపోయాడు. ఈసారి గుండె భూమ్మీద పడింది. అయినా కూడా చెక్కుచెదరలేదు. చివరకు బాధితుడికి గుండెను అమర్చి బతికించారు.ఈ అద్భుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగింది.

ఓ రోగిని కాపాడేందుకు దాత నుంచి సేకరించిన గుండెను హుటాహుటిన కేక్ ఆస్పత్రికి తరలించేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే హెలిక్యాప్టర్ హాస్పిటల్ మీద ఉన్న హెలిప్యాడ్ మీదకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది.ఈ ఘటనలో పైలట్ కు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా ఇద్దరు ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు.ప్రమాద సమయంలో గుండెను ఉంచిన బాక్స్ సురక్షితంగానే ఉంది.

ఇక గుండె బాక్స్ ను తీసుకొని వెళుతున్న వైద్యుడు ఒక్కసారిగా కిందపడ్డాడు. ఆ గుండె కూడా బాక్సు నుంచి జారి కిందపడింది. అయినా ఆ గుండెకు ఏమీ కాలేదు. కిందపడ్డ గుండెను శుభ్రం చేసిన వైద్యులు వ్యక్తికి అమర్చి ప్రాణం పోశారు. ఈ అద్భుతానికి నిదర్శనమైన లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.