Begin typing your search above and press return to search.

గాల్లో చిక్కుకున్న ఆ వ్యాపార వేత్త హెలీకాఫ్టర్.. రోడ్డు పక్కన ఎమర్జెన్సీ ల్యాండింగ్

By:  Tupaki Desk   |   11 April 2021 8:30 AM GMT
గాల్లో చిక్కుకున్న ఆ వ్యాపార వేత్త హెలీకాఫ్టర్.. రోడ్డు పక్కన ఎమర్జెన్సీ ల్యాండింగ్
X
ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌, లులూ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ ఎం.ఎ. యూసుఫ్ అలీ ప్ర‌యాణిస్తున్న హెలీకాఫ్ట‌ర్ ఎమ‌ర్జెన్సీ ల్యాండ్ తీసుకుంది. ఇంజిన్లో సాంకేతిక లోపం త‌లెత్త‌డం, అదే స‌మ‌యంలో భీక‌ర గాలులు వీచ‌డంతో రోడ్డుప‌క్క‌నే దింపేశాడు పైల‌ట్. ఈ ఘ‌ట‌న ఆదివారం ఉద‌యం కొచ్చి శివార్ల‌లో చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న స‌మ‌యంలో చాప‌ర్ లో యూసుఫ్ అలీతోపాటు ఆయ‌న భార్య‌, మ‌రో ఐదుగురు ఉన్నారు. వీరు స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం. ఎవ్వ‌రికీ ప్రాణ‌హాని జ‌ర‌గ‌లేదు. విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని, క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

హెలీ కాఫ్ట‌ర్ లో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతోపాటు ఆ స‌మ‌యంలోనే భారీగా గాలులు వీచాయ‌ని స‌మాచారం. దీంతో.. చాప‌ర్ డోర్లు జామ్ అయ్యాయ‌ని, ఎంత‌కీ తెరుచుకోలేద‌ని స‌మాచారం. పోలీసులు వ‌చ్చిన త‌ర్వాత డోర్ల‌ను తొల‌గించి, వారిని ఆసుప‌త్రికి పంపించిన‌ట్టు తెలుస్తోంది.

కాగా.. రెండు రోజుల క్రిత‌మే యూసుఫ్ అలీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డును అందుకున్నారు. దుబాయ్ రాజు మొహ్మ‌ద్ బిన్ జాయెద్ చేతుల మీదుగా ‘హ‌య్యెస్ట్ సివిలియ‌న్ అవార్డు’ అవార్డు తీసుకున్నారు. వెంటనే ఇలా జరగడం గమనార్హం. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.