Begin typing your search above and press return to search.
కేసీఆర్ సలహాను తప్పుబట్టిన మాజీ గవర్నర్
By: Tupaki Desk | 1 May 2020 11:10 AM GMTకరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్షీణదశలోకి చేరింది. దాదాపు 50 రోజులుగా దేశమంతా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ ఆదాయం సింగిల్ డిజిట్‌కు చేరాయి. ఈ క్రమంలో తిరిగి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందా అని అందరి మెదళ్లను తొలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి ఎలా చేరేదనే దానిపై ఆర్థికవేత్తలు, ప్రభుత్వ యంత్రాంగం సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలు ఎప్పుడు వినని పరిష్కారం తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి హెలీకాఫ్టర్ మనీ విధానం అవలంభించాలని సూచించారు. దాంతో పాటు మరో పరిష్కారం కూడా చెప్పారు. అయితే ప్రధానంగా చర్చ మాత్రం హెలీకాప్టర్ మనీపై సాగింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పందించారు. అయితే కేసీఆర్ చెప్పిన విధానం శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
డబ్బు ప్రింట్ చేయడానికి పూర్తిగా అవకాశం లేదని అనడం లేదు.. కానీ అదే సంక్షోభానికి పరిష్కారం కాదని తెలిపారు. నగదు ముద్రించడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదని పేర్కొన్నారు. నోట్లు ముద్రించి ఇవ్వడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నోటు విలువ తగ్గితే.. ధరలు పెరుగుతాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు నోట్లు ఉండి కూడా ఉపయోగమేంటని ప్రశ్నించారు. అమెరికాతో మనం పోల్చుకోవడం తప్పని, అమెరికా కరెన్సీనే డాలర్.. వారికి అప్పులు ఇవ్వడానికి ప్రపంచమంతా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మన దగ్గర డాలర్ ఉంటే మనకూ అప్పులిస్తారు. మనకు అప్పులు కావాలంటే మన దగ్గరే పుట్టించాలని సూచించారు.
2008లో వచ్చిన సంక్షోభం ఫైనాన్సియల్ సెక్షన్లో ఉంది. ప్రజల డబ్బు, వారి సేవింగ్స్ పై ప్రభావం పడిందని మాజీ గవర్నర్ గుర్తు చేశారు. ఇది పూర్తిగా డబ్బుతో ముడిపడిన అంశం.. కాబట్టి ఆర్బీఐ, ఫెడరల్ బ్యాంకులు ముందున్నాయి. ఇప్పుడు సంక్షోభానికి కారణం డబ్బు కాదు. సరఫరా వ్యవస్థ, తర్వాత ఆర్థిక వ్యవస్త. అందుకే భిన్నంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఆర్బీఐ 4 పాయింట్ ఫార్ములా తీసుకోవడంతో సత్ఫలితాలొస్తాయన్నారు ఆయన చెప్పారు.
ప్రస్తుత సంక్షోభానికి ఒకటే మార్గమని, కేంద్రం, రాష్ట్రాలు అప్పులు చేయాల్సిందేనని దువ్వూరి సుబ్బారావు స్పష్టం చేశారు. అయితే మితంగా అప్పులు చేయాలని సూచించారు. కొద్ది తీసుకుంటేనే మార్కెట్‌లో విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆచి తూచి వ్యవహరించాలని తెలిపారు.