Begin typing your search above and press return to search.
మార్స్ పైకి హెలిక్యాప్టర్.. ఏం చేయబోతుందంటే..!
By: Tupaki Desk | 5 April 2021 6:30 AM GMTఅరుణ గ్రహం (మార్స్) పై పరిశోధనలు కొత్త కాదు. ఇక్కడ మానవ మనుగడకు అవకాశం ఉందా? అనే విషయాలు తెలుసుకొనేందుకు అనేక ప్రయోగాలు సాగుతున్నాయి. అయితే మార్స్ అంతర్భాగంలో నీటి జాడ ఉన్నట్టు ఇప్పటికే పరిశోధనలో తేలింది. ఇదిలా ఉంటే ఇటీవల మార్స్ పై నాసా పరిశోధనలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న మార్స్ పైకి పర్సీవరెన్స్ రోవర్ దిగింది. అయితే తాజాగా అరుణగ్రహంపైకి ఓ మినీ హెలీక్యాప్టర్ వెళ్లింది. ఈ హెలిక్యాప్టర్ ఎందుకు వెళ్లింది. అక్కడ ఏం చేయబోతున్నది తదితర విషయాలను నాసా వెల్లడించింది.
నాసా కు చెందిన ఇంజెన్యూటీ మినీ హెలికాప్టర్ మార్స్‌పైకి వెళ్లింది. దాదాపు 47 కోట్ల కిలోమీటర్ల పాటు నాసా పర్వీవరెన్స్ రోవర్ తోపాటు ఈ హెలీక్యాప్టర్ ప్రయాణం చేసింది. ఆదివారం రోవర్ ఉదర భాగం నుంచి మార్స్ ఉపరితలంపైన దిగింది. నాసాకు చెందిన జెట్ ప్రపల్టన్ లేబోరేటరీ(జేపీఎల్) ఆదివారం ఈ మేరకు ఈ ట్వీట్ చేసింది. మార్స్ పైన దిగిన ఈ మినీ హెలిక్యాప్టర్ కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది నాసా. పర్సీవరెన్స్ పవర్ సిస్టంను సాయంతో ఈ హెలీక్యాప్టర్ పనిచేయనున్నది. దీనికి సొంత బ్యాటరీ కూడా ఉంది.
సాధారణంగా అరుణ గ్రహంపై రాత్రి వేళల్లో మైనస్ 90 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ హెలీక్యాప్టర్ ఎంతమేరకు పనిచేస్తుందో వేచి చూడాలి అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ హెలీ క్యాప్టర్ అరుణ గ్రహంపైకి వెళ్లి.. అక్కడ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయనున్నది. అంతేకాక అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ. కాబట్టి ఈ హెలీక్యాప్టర్ అక్కడ ఎగరగలుగుతోందో లేదో కూడా వేచి చూడాలి. అయితే ఈ హెలీక్యాప్టర్ భూమి మీదకు వచ్చాక పలు ఆసక్తికరమైన విషయాలు తెలియనున్నాయి. అక్కడి వాతావరణ పరిస్థితులపై మరింత అంచనా వచ్చే అవకాశం ఉన్నది.