Begin typing your search above and press return to search.
బైక్ మీద వెళ్తున్నారా..?దాన్ని తీసుకెళ్తున్నారా?
By: Tupaki Desk | 12 Nov 2015 4:42 AM GMTమీరు ఏపీలో ఉంటున్నారా? మీకు బైక్ ఉందా? బయటకు వెళ్తున్నారా? అయితే.. ఒక్క క్షణం.. బయటకు వెళుతున్న మీరు ఎప్పటిమాదిరి వెళ్లిపోతే.. అడ్డంగా బుక్ అయిపోయే ఛాన్స్ ఉంది. టూవీలర్ మీద వెళ్లే ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న కఠిన నియమాన్ని ఏపీ సర్కారు ఈ రోజు నుంచి షురూ చేస్తోంది.
వాస్తవానికి ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది మొదటి రోజు నుంచే అమలు చేయాలని భావించారు. అయితే.. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ నిర్ణయాన్ని నవంబరు 1 నుంచి అమలు చేయాలని భావించారు. అయితే.. ప్రజల్లో అవగాహన మరింత పెంచేందుకు వీలుగా.. హెల్మెట్ తప్పనిసరి అన్న నిబంధనను పక్కన పెట్టారు. అయితే.. గురువారం (నవంబరు 12) నుంచి టూవీలర్ మీద ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిర్ణయాన్న ప్రభుత్వం తీసుకుంది.
ఒకవేళ.. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపితే.. భారీ జరిమానాలు విధించనున్నారు. ఈ నేపథ్యంలో రోజూ మాదిరి కాకుండా.. హెల్మెట్ ను వెంటబెట్టుకు తీసుకెళ్లాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. హెల్మెట్ ధరించటంపై ఎలాంటి మినహాయింపులు ఉండవని.. అందరూ హెల్మెట్ ధరించాల్సిందేనంటూ ఏపీ సర్కారు స్పష్టం చేసింది.