Begin typing your search above and press return to search.
హెల్మెట్ పెట్టుకోనందుకే ఆ సీఎం భార్య మరణం!
By: Tupaki Desk | 9 Jun 2019 6:47 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హడావుడి మామూలుగా ఉండదు. ఒక కార్పొరేటర్ హంగు ఆర్భాటం మామూలుగా ఉండదు. ఇక.. మంత్రుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక.. ముఖ్యమంత్రి పొజిషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కనిపించే హడావుడి.. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు చూపించే ఆర్భాటం చాలా రాష్ట్రాల్లో కనిపించదు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సతీమణులు బైక్ మీద వెళ్లటాన్ని మనం ఊహించగలమా? ముఖ్యమంత్రి దాకా ఎందుకు.. ఎమ్మెల్యే సతీమణి.. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా టూవీలర్ మీద వెళ్లటం కనిపించదు. కానీ.. అన్ని రాష్ట్రాలు అలా ఉండవు. ఎక్కడ దాకానో ఎందుకు పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణినే చూద్దాం. ఆమె ఎంచక్కా టూ వీలర్ మీద ప్రయాణిస్తూ ఉంటారు.
అయితే.. ఇటీవల ఆమె టూ వీలర్ మీద స్నేహితురాలితో కలిసి వెళుతూ.. టెంపో వ్యాన్ ఢీ కొనటంతో చనిపోయారు. తీవ్ర గాయాలకు గురైన ఆమె.. మరణించారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల మీడియాలో ఎక్కడా కనిపించదు. అయితే.. అనుకోనిరీతిలో పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ మాటలు ఈ ఉదంతం అందరి దృష్టిలో పడే అవకాశాన్ని ఇచ్చింది. సీఎం సతీమణి హెల్మెట్ పెట్టుకోని కారణంగానే మరణించారని ఆమె వ్యాఖ్యానించారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి.. గవర్నర్ల మధ్య ఉన్న ఘర్షణ కారణంగా హెల్మెట్ చట్టం అమలులోకి రాకుండా చిక్కులు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలన్న చట్టాన్ని అమలు చేయలేదు. అయితే.. హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాల్ని నడిపే వారి లైసెన్స్ లు రద్దు చేయాలన్న నిర్ణయం అమలు చేయలేదు. ఇలాంటి తప్పులే.. సీఎం సతీమణి టూవీలర్ ప్రయాణించే సమయంలో పెట్టుకోలేదని.. రోడ్డు ప్రమాదంలో ఆమె మరణానికి హెల్మెట్ పెట్టుకోకపోవటం కూడా కారణమని గవర్నర్ కిరణ్ బేడీ ప్రస్తావించారు. మిగిలిన రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.. ఒక ముఖ్యమంత్రి సతీమణి టూ వీలర్ మీద ప్రయాణం చేస్తారన్న విషయం తెలుగు ప్రజలకు కచ్ఛితంగా ఆశ్చర్యానికి గురి చేయటం ఖాయం.