Begin typing your search above and press return to search.
హెల్మెట్ల హడావుడితో ఏపీలో కొత్త తలనొప్పులు
By: Tupaki Desk | 2 Aug 2015 11:04 AM GMTచట్టం తేనంత కాలం చేతులు కట్టుకొని కూర్చునే వారు.. చట్టం చేసిన వెంటనే లాఠీ ఝుళిపించటం మామూలే. కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ప్రజలకు చట్టం పట్ల అవగాహన కలిగించటం.. చట్టం చేయాల్సిన అవసరాన్ని తెలియజేసి.. ప్రజల వైఖరిలో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేమీ లేకుండా.. దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.
ఏపీలో హెల్మెట్లను కచ్ఛితం చేస్తూ చట్టం చేయటం తెలిసిందే.దీన్ని అమల్లోకి తెచ్చిన వెంటనే.. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. కొన్ని జిల్లాల్లోపోలీసులు అత్యత్సాహం ప్రదర్శిస్తుంటే.. మరికొన్ని జిల్లాల్లో సంయమనంతో వ్యవహరిస్తూ.. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణాల్ని తగ్గించేందుకు హెల్మెట్ వాడకాన్ని వీలైనంత వరకూ పెంచాలన్న నిర్ణయం మంచిదే. దాన్ని ఎవరైనా సమర్థిస్తారు. కానీ.. ఇంతకాలం అమలు కాని చట్టం.. కొత్తగా అమలు అవుతున్న సమయంలో.. ఆ విషయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా.. హెల్మెట్ రూల్ అమల్లోకి వచ్చిన వెంటనే.. చలానా పుస్తకాలు తీసుకొని కొన్ని జిల్లాల్లో పోలీసులు రోడ్ల మీదకు వచ్చేసి హడావుడి చేస్తున్నారు. జరిమానాలు విధించి.. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు.
మరికొన్ని జిల్లాల్లో మాత్రం హెల్మెట్ లేకుండా బండిని నడిపే వారిని ఆపి.. బండిని స్వాధీనం చేసుకొని.. హెల్మెట్ కొని వచ్చిన తర్వాత బండిని తిరిగి ఇచ్చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఈ నెల రెండో వారం నుంచి హెల్మెట్ రూల్ ని కచ్ఛితంగా అమలు చేస్తామని.. ఈ లోపు వాహనదారులంతా హెల్మెట్లు కొనుక్కోవాలని అధికారులు ప్రచారం మొదలుపెట్టారు. ఇక..పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే.. హెల్మెట్ ధరించకున్నా రెండు నెలల పాటు జరిమానా అన్నది విధించొద్దని.. వాహనదారులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ సూచిస్తున్నారు.
ఇలా ఎవరికి తోచినట్లుగా వారు కాకుండా.. ఏపీ రాష్ట్ర సర్కారు.. ఒక విధివిధానాన్ని రూపొందించి.. అందుకు తగ్గట్లుగా ప్రజల్లో హెల్మెట్ వినియోగ అవసరం.. దాని వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు.. చట్టం అమలు అయితే.. శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయన్న ప్రచారాన్ని జోరుగా చేపట్టాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ చట్టం అమలుకు కొద్ది రోజులు ప్రజలకు గడువు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.