Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో గాయపడిన తెలుగోడికి సాయం చేద్దాం

By:  Tupaki Desk   |   8 Jan 2019 12:50 PM GMT
ఆస్ట్రేలియాలో గాయపడిన తెలుగోడికి సాయం చేద్దాం
X
రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలుగు వ్యక్తి రతీష్ కుమార్ బత్తల తీవ్రంగా గాయపడ్డాడు. అతని మోకాలు విరిగిపోయింది. రెండు మోచేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.

రతీష్ కుమార్ బత్తల మన తెలుగువాడు. రతీష్ కుటుంబతో సహా ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాడు. ఉదయాన్నే ఆఫీస్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదు. అయితే.. నాలుగు నెలల పాటు మంచానికే పరిమితం కావాల్సి ఉంటుంది. రతీష్ కుమార్ కు భార్య ఒక కుమారుడు ఉన్నారు. కేవలం ఉద్యోగం మీదే ఆధారపడిన రతీష్ కు చాలా భారంగా మారింది రతీష్ కు. అందుకే… అక్కడి భారతీయులు.. ముఖ్యంగా తెలుగువారు రతీష్ కుటుంబానికి అండంగా నిలబడ్డారు. రతీష్ కు సాయం అందించడంతో పాటు గోఫండ్ మి.కామ్ అనే వెబ్ సైట్ ద్వారా విరాళాల్ని సేకరిస్తున్నారు. సదరు వెబ్ సైట్ లో.. ఇంతవరకు ఎంత పోగయ్యాయి ఎవరు ఎంత ఇచ్చారు అనే విషయాన్ని స్పష్టంగా పొందుపరిచారు.

https://www.gofundme.com/help-support-ratish-kumar-battalas-recovery?member=1413506&utm_source=facebook&utm_medium=social&utm_campaign=fb_tco_campmgmtbnr_w&fbclid=IwAR32VSmrdzl5qYnRcXbSwOHL2EA5Kxz00ct6grVNusbPsiJMm-C_cbOB1RQ

గోఫండ్ మి.కామ్ ఇండియాలో ఓపెన్ అవ్వదు. అందువల్లే.. అక్కడి తెలుగువాళ్లు మరోక లింక్ ఏర్పాటు చేశారు. ఈ లింక్ ద్వారా మనం రతీష్ కు సాయం చేయవచ్చు.

https://milaap.org/fundraisers/support-rathish-kumar-battala?mlp_referrer_id=893115&utm_medium=auto_share&utm_source=whatsapp


ఒకవేళ పేటీఎం ద్వారా విరాళాలు అందించాలంటే ఈ లింక్ ని క్లిక్ చెయ్యాలి.

https://paytm.com/?comment=originId_59247&amount=2500&amount_editable=1

యూపీఐ ద్వారా పేమెంట్ చెయ్యాలి అనుకుంటే..లింక్ ద్వారా ఎమౌంట్ పంపవచ్చు.

https://milaap.org/fundraisers/support-rathish-kumar-battala/upi_deeplink

ఆన్ లైన్ లో డైరెక్ట్ గా బ్యాంక్ ఎక్కౌంట్ కు పంపించాలనుకునేవాళ్లు కింది వివరాల ద్వారా ఎమౌంట్ ని పంపవచ్చు.

Account number: 8080811059247
Account name: Rathish Kumar Battala
IFSC code: YESB0CMSNOC

ఆస్ట్రేలియాలో ఇబ్బంది పడుతున్న మన సోదరుడి కుటుంబానికి సాయం చేద్దాం. మీ తరపున ఎంతోకొంత సాయం చేయండి. అతని కుటుంబానికి అందిద్దాం. తెలుగువారు ఎక్కడున్నా మనమంతా అండగా నిలబడతాం అని మరోసారి నిరూపిద్దాం.