Begin typing your search above and press return to search.
పబ్ ప్రమాదం..హేమా మాలిని షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 29 Dec 2017 4:19 PM GMTగురువారం అర్ధరాత్రి ముంబైలోని ఓ పబ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 15 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఓ బర్త్ డే వేడుక సెలబ్రేట్ చేసుకుంటుండగా జరగిన ఈ ప్రమాదంలో మరో 12 మందికి గాయాలు అయ్యాయి. పబ్ లోని రెస్టారెంట్ లో షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానిస్తుండగా, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా కలకం రేపింది. ఈ దుర్ఘటన పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే, బీజేపీ ఎంపీ - నటి హేమామాలిని మాత్రం ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో నివసిస్తున్న అధిక జనాభా వల్లే ఈ ప్రమాదం జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతోన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ముంబైలో జనాభా నానాటికీ పెరిగిపోతోందని - నగరంలోకి పరిమితికి మించి జనాభాను అనుమతించడం వల్లే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఒక నగరానికి ఇంతమంది జనాభా ఉండాలంటూ పరిమితులు విధించాలని కోరారు. పోలీసులు తమ విధులు గొప్పగా నిర్వహిస్తున్నారని ఆమె కితాబిచ్చారు. ముంబైలో విపరీతంగా జనాభా పెరిగిపోతోందని - ముంబైలో జనాభా పెరిగిపోయాక ప్రజలు మరో నగరాన్ని ఎంచుకోవాలని, కానీ, ముంబై నగరంలోకి అధిక జనాభా వస్తున్నారని, దీంతో, నగరం విస్తరిస్తూ పోతోందన్నారు. ఒక్క ముంబైకే కాకుండా.... ప్రతి నగరానికి జనాభా పరిమితి ఉండాలని సూచించారు. పరిమితి దాటాక వారిని వేరే నగరానికి, అక్కడ నుంచి మరో నగరానికి వెళ్లనివ్వాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
హేమమాలిని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. బాధ్యత గల ఎంపీ పదవిలో ఉన్న హేమా మాలిని నుంచి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు రావడం బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ కు అధిక జనాభాకు ఏం సంబంధమని వారు ప్రశ్నిస్తున్నారు. సరైన రక్షణ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల అది జరిగి ఉండవచ్చని, దానికి ముంబై ప్రజలకు ఏం సంబంధమని అంటున్నారు. ఇటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకున్నందుకు ముంబై వాసులు ఇటువంటి వ్యాఖ్యలను భరించాల్సిందేనని ఎద్దేవా చేస్తున్నారు.