Begin typing your search above and press return to search.
‘తాగుడు’ వ్యాఖ్యలపై హేమమాలిని స్పందించింది
By: Tupaki Desk | 15 April 2017 6:53 AM GMTతన ప్రమేయం లేకుండా హేమమాలిని రెండు రోజులుగా వార్తల్లో నానుతూ ఉంది. ఓం ప్రకాశ్ బాబారావ్ కాడు అలియాస్ బచ్చు కాడు అనే మహారాష్ట్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఒకరు హేమమాలినిని ఓ అనవసర వివాదంలోకి లాగేశాడు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు వారి తాగుడే కారణమంటూ ఎవరో చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ఎంపీ అయిన హేమమాలిని రోజూ మద్యం తాగుతుందని.. మరి ఆమె ఆత్మహత్య చేసుకుంటుందా అని ప్రశ్నించాడు బచ్చు కాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హేమమాలిని అభిమానులు అతడిపై మండిపడ్డారు. అనవసరంగా ఆమె పేరును ఇందులోకి ఎందుకు లాగావంటూ మండిపడ్డారు.
మొత్తానికి హేమమాలిని తన ప్రమేయం లేకుండా వార్తల్లోకి వచ్చింది. ఈ వ్యాఖ్యలు ఆమె ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేశాయి. ఐతే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై హేమమాలిని సైలెంటుగా ఉండిపోలేదు. స్పందించింది. ఐతే తాను తాగుతానా.. తాగనా అనే మాట ఆమె ఎత్తలేదు. తాను ఈ వివాదంలో జోక్యం చేసుకుని వార్తల్లో నిలవదలుచుకోలేదని.. ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు కేవలం పబ్లిసిటీ స్టంటు మాత్రమే అని ఆమె స్పష్టం చేసింది. దేవుడు అతడికి సాయం చేయాలి అంటూ శాంతికామకురాలిలాగా మాట్లాడింది హేమమాలిని. ఒకప్పటి ఈ అందాల తార.. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని మధుర లోక్ సభ స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/