Begin typing your search above and press return to search.
మోడీని వ్యతిరేకించిన సీఎం.. పదవి పోయే పరిస్థితి! ఎక్కడ? ఎందుకు?
By: Tupaki Desk | 25 Aug 2022 9:30 AM GMTఆయన యువ నాయకుడు.. మంచి తెలివిగల వాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన చుట్టూ ఉన్న రాష్ట్రాల వారు.. బీజేపీని సమర్ధించేవారు.. ప్రధాని మోడీని పూజించేవారు అయినా.. ఆయన మాత్రం మోడీని.. ఆయన విధానాలను వ్యతిరేకించి.. వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా మత సామరస్యం మంటగలుపుతున్నారని.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని.. దేశంలో కొత్తగా బీజేపీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని.. ఫైరైన ముఖ్యమంత్రి. అయితే.. ఇప్పుడు.. ఆయనకు ఏకంగా పదవీ గండం పొంచి ఉంది.
ఆయనే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, గిరిజన సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు.. ఐఐటీయెన్ హేమంత్ సోరెన్. ఇప్పుడు ఆయనకు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్ రమేశ్ బైస్కు ఈమేరకు నివేదిక సమర్పించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం.
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్.. మైనింగ్ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్రం కూడా దృష్టి పెట్టింది.
ఆ వెంటనే.. గవర్నర్ స్పందించారు. నిజానికి ముఖ్యమంత్రిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఆచి తూచి ఆలోచించి.. పెండింగులో పెట్టిన గవర్నర్‌లు ఉన్నారు. కానీ, ఇక్కడ మోడీ వ్యతిరేక ముఖ్యమంత్రి కావడంతో రోజుల వ్యవధిలోనే .. సీఎంను ఏం చేయాలంటూ.. ఎన్నికల సంఘాన్ని గవర్నర్ అభిప్రాయం కోరారు.
నిజానికి సాక్షాత్తూ.. సీఎం తప్పు చేసి ఉంటే..దీనిని పక్కాగా నిరూపించాల్సిన అవసరం ఉంది. కానీ.. ఎలాంటి ఆధారాలు చూసిందో.. ఎలా నిర్దారించిందో తెలియదు కానీ.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా 48 గంటల్లోనే సీఎంపై నివేదిక ఇచ్చేసింది. అంతేకాదు.. అతి త్వరలోనే ముఖ్యమంత్రిపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని.. ఎన్నికల సంఘం సూచించడం.. గమనార్హం. దీంతో గవర్నర్ మరికొద్ది గంటల్లోనే సీఎంను రాజీనామా చేయాలని కోరే అవకాశం ఉంది.
దీంతో జార్ఖండ్‌లో ప్రభుత్వం కుప్పకూలుతుంది. అయితే.. ఈ సమయంలో హేమంత్‌కు మద్దతు ఉంది కాబట్టి.. కూటమి పార్టీలో ఎవరినో ఒకరిని ఆయన సీఎం చేసే అవకాశం ఉంది. లేదా.. తన సతీమణినే సీఎం చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి మోడీతో పెట్టుకుంటే.. ఏం జరుగుతుందనేది ఇది ఒక ఉదాహరణగా చెబుతున్నారు పరిశీలకులు.