Begin typing your search above and press return to search.

బీజేపీ నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకున్న హేమంత్ సోరెన్

By:  Tupaki Desk   |   5 Sep 2022 4:30 PM GMT
బీజేపీ నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకున్న హేమంత్ సోరెన్
X
కేంద్రంలోని బీజేపీ పెద్దలతో పోరాడుతున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చచ్చీ చెడీ ఎట్టకేలకు తన ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకున్నాడు. తీవ్ర రాజకీయ ఉత్కంఠ నడుమ ముఖ్యమంత్రి సోరెన్ విశ్వాస పరీక్ష నెగ్గడం విశేషం. మొత్తం 81 మంది సభ్యులన్న ఝార్ఖండ్ అసెంబ్లీలో సోరెన్ సర్కార్ కు 48 మంది మద్దతు ఇచ్చారు. దీంతో ఆయన ప్రభుత్వం పడిపోకుండా నిలబడింది.

సీఎంగా సోరెన్ తనకు తాను ఓ గని లీజును కేటాయించుకోవడంతో ఈ వివాదం మొదలైంది. లాభదాయక పదవి నిబంధనల కింద వేటు వేయాలని.. ఎమ్మెల్యేగా అనర్హుడు అంటూ విపక్షాలు డిమాండ్ చేశఆరు. సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో ఈసీ సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసింది.

దీంతో ఝార్ఖండ్ లో సీఎం సోరెన్ శాసనసభ్యత్వం రద్దు అయ్యి సంక్షోభం తలెత్తడానికి రెడీ అయ్యింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో గవర్నర్ కు అధికార కూటమి ఎమ్మెల్యేలు స్పందన కోరుతూ విజ్ఞప్తి చేశాయి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఝార్ఖండ్ గవర్నర్ ప్రకటించారు.

ఈ క్రమంలోనే విశ్వాస పరీక్షను నిర్వహించారు. ఝార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఓటింగ్ కు ముందు సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ ఓటింగ్ సందర్భంగా సోరెన్ మాట్లాడారు.

ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అల్లర్లకు ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. అంతర్యుద్ధం తెస్తోందన్నారు. ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అసోం ముఖ్యమంత్రి హిమంత ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిమగ్నమయ్యారన్నారు.

అసెంబ్లీలో విశ్వాస పరీక్షల్లో హేమంత్ కు మద్దతుగా ఏకంగా 48మంది సపోర్ట్ చేయడంతో ఆయన ప్రభుత్వం పడిపోకుండా నిలబడింది. బీజేపీ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసి సంక్షోభానికి దారితీయించినా కూడా సోరెన్ మాత్రం తనను తాను క్యాంప్ కట్టి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఈరోజు శాసనసభలో బలనిరూపణ చేసుకొని ప్రభుత్వాన్ని నిలబెట్టారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.