Begin typing your search above and press return to search.

ఉదయాన్నే ఈ టిఫిన్స్ తింటే శృంగారంలో రెచ్చిపోతారట...

By:  Tupaki Desk   |   22 May 2020 11:30 PM GMT
ఉదయాన్నే ఈ టిఫిన్స్ తింటే శృంగారంలో రెచ్చిపోతారట...
X
శృంగారాన్ని ఆస్వాందించాలని ప్రతి యువ జంట కోరుకుంటుంది. లైంగిక ఇబ్బందులు ఎదురైతే అది భార్యాభర్తల అనుబంధంపై ప్రభావం చూపుతుంది. చక్కటి శృంగార జీవితం ప్రేమను పెంచుతుంది. ఒత్తిడి, ఇతర సమస్యలు, తీసుకునే ఆహారం లైంగిక హార్మోన్లపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌‌గా సరైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. విటమిన్-డితో కూడిన ఆహారాన్ని ఉదయం వేళల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు.

విటమిన్-డి లోపించడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్, పురుషుల్లో టెస్టోస్టిరాన్ హర్మోన్ స్థాయిలు తగ్గుతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పుట్టగొడుగులు, సెరల్స్, గుడ్లు, చేపలను ఉదయాన్నే తీసుకుంటే విటమిన్-డి స్థాయిలు పెరుగుతాయని లండన్‌ కు చెందిన న్యూట్రిషనిస్టు రోబ్ హాబ్సన్ చెబుతున్నారు. ఆయిలీ ఫిష్, గుడ్లు, పుట్టగొడుగుల్లో విటమిన్-డి సహజంగా లభిస్తుందని రోబ్ తెలిపారు.

ఉదయాన్నే ఓట్స్, తృణధాన్యాలు, సెరల్స్‌‌ను సోయా మిల్క్ తీసుకోవాలి. ఓ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కూడా శృంగార ఆస్వాదన స్థాయిలను పెంచుకోవచ్చు. సముద్రపు చేపల్లో విటమిన్-డి అధికంగా ఉంటుంది. సాల్మాన్, మాకెరెల్ లాంటి ఆయిలీ ఫిష్‌లలో ఇది పుష్కలంగా లభిస్తుంది. పెంచిన సాల్మాన్ చేపలతో పోలిస్తే సహజంగా లభించే వాటిలో నాలుగు రెట్లు అధికంగా విటమిన్-డి ఉంటుంది.

శాకాహారులు తృణధాన్యాలు, పుట్టగొడుగుల ద్వారా విటమిన్-డిని పొందొచ్చు. వీటిల్లో విటమిన్ డి2 ఉంటుంది. జంతువుల నుంచి లభించే ఆహారంలో విటమిన్ డి3 ఉంటుంది. వీటిలో విటమిన్ డి3 ఎఫెక్టివ్‌గా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అడవుల్లో దొరికే పుట్టగొడుగుల్లో విటమిన్-డి2 విరివిగా లభిస్తుంది. ఇవి తింటే మీరు శృంగారంలో రెచ్చిపోవడం ఖాయమంటున్నారు..