Begin typing your search above and press return to search.
బట్టతల ఉన్న వారికి ఇది శుభవార్త
By: Tupaki Desk | 21 Sep 2019 7:30 AM GMTబట్టతల.. ఇప్పుడు మగవారికి ఇదో పెద్ద సమస్య. 35 ఏళ్లు దాటగానే జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. 40 ఏళ్లకు ఖాళీ గుండుగా మారుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది హెయిర్ ప్లాంటేషన్ తో మళ్లీ తిరిగి మాములు జుట్టును తెచ్చుకుంటున్నారు. అయితే చాలా రిస్కీ.. ఏమాత్రం తేడా వచ్చినా ప్రమాదమే..
ఇక మన స్టార్ హీరోలు, ప్రముఖులు కూడా ఈ బట్టతలతో బాధపడినవారే.. వారంతా హెయిర్ ప్లాంటేషన్ తోనే ఇప్పుడు మనకు నిండైన జట్టుతో కనిపిస్తున్నారు.. కొందరు విగ్గుతో కవర్ చేస్తున్నారు.
ఇలా ఇంతమందిని వేధిస్తున్న బట్టతల సమస్యకు అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. వారు ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు బట్టతల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.
విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా నానో జనరేటర్లను తయారు చేశారు. వాటిని ఎలుకలపై ప్రయోగించారు. నానో జనరేటర్ల దండను ఎలుకల తలకు కట్టారు. అవి అటూ ఇటూ కదలుతున్నప్పుడు నానో జనరేటర్ల నుంచి అతి స్వల్ప పౌనఫున్య విద్యుత్ తరంగాలను వెలువడేలా చేశారు. వాటి ప్రభావంతో బట్టతలపై నిద్రాణంగా ఉన్న సూక్ష్మరంధ్రాలు చైతన్యవంతమై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగంతో బట్టతలపై కొత్త జుట్టు వచ్చింది.
ఏ ఆపరేషన్ లేకుండా కేవలం నానో జనరేటర్ల సాయంతో వెలువడే స్వల్ప విద్యుత్ తరంగాలతో కొత్త జట్టును మొలిపించే ఈ టెక్నాలజీని మనుషులపై ప్రయోగించి త్వరలోనే ఈ చికిత్సను అందుబాటులోకి తేవడానికి శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. ఇది ఫలవంతమైతే ఇక బట్టతల వారు మన సమాజంలో కనిపించరు..