Begin typing your search above and press return to search.
బ్యాంకులకు వంద కోట్ల వరకు ఎగనామం పెట్టిన ప్రముఖుల లిస్ట్ ఇదే..!
By: Tupaki Desk | 23 Dec 2022 11:30 PM GMTఒకప్పుడు బ్యాంకులనేవి పేద.. సామాన్య.. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి ఖాతాదారులకు సేవలందించేవి. కానీ కార్పొరేట్ కల్చర్ వచ్చాక బ్యాంకులనేవి కేవలం ధనవంతులు.. సెలబ్రెటీలు.. బడా వ్యాపారులకు జేబులోని క్రిడెట్ కార్డులా మారిపోయింది. పేదలకు.. రైతులు.. మధ్యతరగతి ప్రజలకు లక్ష రూపాయలు లోన్ ఇవ్వడానికి సవాలక్ష కారణాలు చెప్పే బడా వ్యాపారవేత్తలకు మాత్రం కళ్లు ముసుకొని వేలకోట్లు కట్టబెడుతున్నాయి.
తిరిగి వాటిని వసూళ్లు చేయలేక ఆ ఖర్చంతా తిరిగి ఖాతాదారుల నెత్తిన మోపుతుండటం ఇటీవలీ కాలంలో బ్యాంకులకు తరుచూ కామన్ గా మారింది. గత ఐదేళ్లలో కార్పొరేటు దిగజాలకు బ్యాంక్‌లు మాఫీ చేసిన పది వేల లక్షల కోట్ల రుణాలను రైటాప్ చేశాయి. వీటిలో ఇప్పటి వరకు కేవలం లక్ష కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసిన బ్యాంకులు మిగతా తొమ్మిది లక్షల కోట్లు ఇంకా వసూలు చేస్తున్నట్లుగానే పేర్కొంటున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం 2022 మార్చి 31 నాటికి దేశంలోని టాప్ 50 మంది ఎగవేతదారుల నుంచి బ్యాంకులకు రూ.92 వేల 570 కోట్లు వసూలు కావాల్సి ఉందని పేర్కొంది. ఈ వివరాలను డిసెంబర్ 19న పార్లమెంటు వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉద్దేశ పూర్వకంగా రుణాలను ఎగ్గొట్టిన వారిని బ్యాంకులు ఆర్థిక వ్యవస్థ నుంచి బహిష్కరిస్తూ వస్తున్నాయి.
ఇక ఈ లిస్టులో తొలి స్థానంలో 7వేల 848 కోట్లతో గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మోహన్ చొక్సి ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 5వేల879 కోట్లతో ఎరా ఇన్ఫ్రా.. 4వేల 803 కోట్లతో రీ అగ్రో కంపెనీలు ఉన్నాయి. అంటిగ్వన్ పౌరుడిగా ఉన్న చొక్సి భారతదేశ న్యాయ విధానానికి అతీతుడిగా ఉన్నాడు. ఇక ఇదే లిస్టులో లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. విన్సమ్ జ్యుయలరీ అండ్ డైమండ్స్ ప్రమోటర్ జతిన్ మెహతా.. చొక్సి మేనల్లుడు నీరవ్ మోడీ వంటి ప్రముఖలు బ్యాంకు రుణాల ఎగవేతదారుల లిస్టులో ముందంజలో ఉన్నారు.
అయితే వీరిపై చర్యలు తీసుకోవడంలో మాత్రం మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. గత కొన్నేళ్లుగా నీరవ్ మోడీని అప్పగించాలని UK ప్రభుత్వంపై భారత్ ఒత్తిడి తీసుకొస్తూనే ఉంది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. అయితే బ్యాంకు ఎగవేతలన్నీంటిని బ్యాంక్‌లు రద్దు చేసిన ప్రతి రూపాయిని ప్రొవిజనింగ్ కింద లెక్క కడుతాయి. దీంతో బ్యాంక్‌ల ఆదాయం దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల మళ్లీ నష్టపోయేది కూడా సామాన్య డిపాజిటర్లు.. సాధారణ షేర్ హోల్డర్లే.
బ్యాంక్ ఎగవేతదారుల విషయంలో ఆర్‌బీఐ.. ప్రభుత్వము.. బ్యాంకు సెక్టార్లు కలిసికట్టుగా పనిచేస్తేనే ఫలితం ఉంటుంది. కానీ ఎగవేతదారుల విషయంలో బ్యాంకులు చేతులేత్తెస్తున్నాయి. దీంతోపాటు ఇటువంటి కేసులు కోర్టుల్లో సుదీర్ఘమైన నడుస్తున్నాయి. దీంతో చివరికీ బ్యాంకులకు ఖాళీ చేతులు మిగులుతున్నాయి. వీరి విషక్ష్ంలో ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.