Begin typing your search above and press return to search.
ఇద్దరు అధికారిణుల మధ్య ఇదెక్కడి పోస్టింగ్ పేచీ!
By: Tupaki Desk | 22 Nov 2022 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో పోస్టింగ్ కోసం ఇద్దరు అధికారిణుల మధ్య పోస్టింగ్ పేచీ నడుస్తోంది. ఒకే పోస్టు కోసం ఇద్దరూ గొడవ పడుతుండటం కలకలం రేపుతోంది. ఒకే పోస్టు కోసం ఇద్దరు జిల్లా స్థాయి అధికారిణుల మధ్య పేచీ వచ్చింది. బదిలీ చేసినా ఒకామె వెళ్లకుండా అక్కడే తిష్ట వేశారు. ఒకే చోట ఇద్దరూ విధులకు హాజరువుతుండటం దేవాదాయశాఖలో చర్చనీయాంశమైంది.
ఇద్దరు అధికారిణుల మధ్య పేచీకి ఎన్టీఆర్ జిల్లాలోని నెమలి వేణుగోపాలస్వామి ఆలయం వేదికైంది. ఇక్కడ ఈవోగా శాంతి ఉన్నారు. ప్రస్తుతం ఈమే ఎన్టీఆర్ జిల్లా దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్ అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వేరే చోటికి బదిలీ చేసినా వెళ్లకుండా ఎన్టీఆర్ జిల్లాలోనే శాంతి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.
గతంలో శాంతి విశాఖ డీఈవోగా పనిచేస్తూ జూన్ చివర్లో బదిలీపై ఎన్టీఆర్ జిల్లాలోని నెమలి దేవస్థానానికి వచ్చారు. అయితే తనను విశాఖపట్నం ఉప కమిషనర్ (డీసీ)గా కానీ, ఆ హోదా కలిగిన విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈవోగా కానీ పంపాలంటూ ఆమె ఉన్నతాధికారులను కోరుతున్నారు.
అయితే దేవదాయ శాఖలో ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండటంతో.. ఆమెను ఆమె అడిగిన రెండుచోట్ల కాకుండా అనకాపల్లి జిల్లాలో సహాయ కమిషనర్ కేడర్ పోస్టులో నియమించారు. దీంతో శాంతి అక్కడికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఎన్టీఆర్ జిల్లాలోనే తిష్ట వేశారు. విశాఖలో తాను కోరిన వాటిలో ఒకచోట ఇవ్వాలని శాంతి పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు శ్రీకాకుళం డీఈవో అన్నపూర్ణను శాంతి స్థానంలో సర్దుబాటు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. దీంతో అన్నపూర్ణ వారం కిందట విజయవాడ కార్యాలయానికి వచ్చి చేరారు. విజయవాడ నుంచి అనకాపల్లికి పోస్టింగ్ పొందిన శాంతి రోజూ విధులకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన అన్నపూర్ణకు ఆమె బాధ్యతలు అప్పగించలేదని తెలుస్తోంది.
కమిషనర్ తాజాగా ఏ ఆదేశాలిస్తే.. వాటిని పాటిస్తామని అటు శాంతి, ఇటు అన్నపూర్ణ చెబుతుండటం గమనార్హం.
కాగా శాంతి వ్యవహారశైలి గతంలోనూ వివాదాస్పదమైంది. గతంలో విశాఖలో ఇన్‌ఛార్జ్ డిప్యూటీ కమిషనర్‌పై ఇసుక చల్లడం అప్పట్లోనే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తాజాగా విజయవాడలో శాంతి, అన్నపూర్ణ ఇద్దరూ ఒకే గదిలో కూర్చుని విధులు నిర్వహిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపుతారేమో వేచిచూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.