Begin typing your search above and press return to search.

హిల్లరీ గెలిస్తే బిల్ క్లింటన్ పరిస్థితేంటి..?

By:  Tupaki Desk   |   7 Nov 2016 6:14 AM GMT
హిల్లరీ గెలిస్తే బిల్ క్లింటన్ పరిస్థితేంటి..?
X
ఆయన ఒకప్పుడు అమెరికాకు అధ్యక్షుడు... అంటే అప్పట్లో ప్రథమ పౌరుడు.. ఆయన భార్య ఫస్ట్ లేడీ. ఆ ఫస్ట్ లేడీ ఇప్పుడు అధ్యక్ష స్థానానికి పోటీ పడుతోంది. గెలిచే అవకాశాలున్నాయనీ అంటున్నారు. ఒకవేళ గెలిస్తే ఆమె భర్తను ఏమని పిలవాలి. మాజీ అధ్యక్షుడు అయిన ఆయన్ను ఫస్ట్ జెంటిల్మన్ అని పిలవాలా? .. అమెరికాలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే చర్చ. ప్రెసిడెంటు రేసులో దూసుకుపోతున్న హిల్లరీ క్లింటన్ భర్త, మాజీ అధ్యక్షుడు అయిన బిల్ క్లింటన్ ను హిల్లరీ గెలిస్తే ఏమని పిలవాలన్న అంశంపై జనం క్లారిటీకి రాలేకపోతున్నారట.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఇంతకుముందెన్నడూ ఓ మహిళ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించలేదు కాబట్టి, ఇలాంటి పరిస్థితి రాలేదు. ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించాల్సిన అవసరమూ లేకపోయింది. ఇప్పుడు, హిల్లరీ గెలిస్తే, బిల్ ను ఏమనాలన్న ప్రశ్న ఉత్పన్నమైంది. హిల్లరీ విజయంతో బిల్ అమెరికాకు తొలి పురుష అధ్యక్ష జీవిత భాగస్వామి అవుతారు.

మరోవైపు వైట్ హౌస్ లో తిరిగి కాలు పెడుతున్న తొలి మాజీ అధ్యక్షుడిగానూ చరిత్ర సృష్టిస్తారు. ఇక బిల్ ను 'మిస్టర్ ప్రెసిడెంట్' అనవచ్చని - 'ఫస్ట్ జంటిల్ మెన్' అనాలని ఎవరికి తోచిన సలహా వారు ఇస్తున్నారు. ఇక హిల్లరీ గెలిస్తే, తాము మాత్రం ప్రొటోకాల్ ప్రకారం నడుచుకుంటామని, అధికార కార్యక్రమాల్లో బిల్ ను మాజీ అధ్యక్షుడిగానే సంబోధిస్తామని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/