Begin typing your search above and press return to search.

ఇలాంటి సమయంలో కూడా దోచుకోవడమేనా చంద్రబాబు ?

By:  Tupaki Desk   |   24 March 2020 11:10 AM GMT
ఇలాంటి సమయంలో కూడా దోచుకోవడమేనా చంద్రబాబు ?
X
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు...దేశంలో నాకంటే సీనియర్ రాజకీయ నేత ఇంకొకరు లేరు అని చాలా గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతుంటారు. కానీ , అయన చేసే పనులలో మాత్రం ఆ అనుభవం, ఆ గొప్పలు మాత్రం కనబడవు. ఇదే ధోరణి అవలంబిస్తుంటేనే ..మొన్నటి ఎన్నికలలో ఏపీ ప్రజలు చెంప చెల్లుమనేలా తమ తీర్పుని ఇచ్చారు. కానీ , ఫలితాలు వచ్చి , ఏడాది కూడా గడవకముందే , దాన్ని మరచి మళ్లీ ప్రజలని మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారు. కానీ , చంద్రబాబు చెప్పే కాకమ్మ కథలు నమ్మేవారు ఇప్పుడు ఎవరు లేరు అని అయన తెలియడంలేదు. చెప్పేదొకటి ..చేసేదొకటి.

అసలు విషయానికొస్తే .... ప్రస్తుత కరోనా ప్రపంచ వ్యాప్తంగా అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ కరోనా ఏపీలో కూడా వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ఏపీలో 7 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ...రాష్ట్రంలోని అన్ని జిల్లాలని ఇప్పటికే లాక్ డౌన్ చేసింది. ప్రజలని కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ..రాష్ట్ర ప్రజానీకానికి అండగా నిలుస్తూ , రాష్ట్రంలో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టింది.

రాష్ట్రాన్ని కరోనాలాంటి మహమ్మారి చుట్టుముట్టిన వేల ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ..ప్రభుత్వానికి తనకున్న అనుభవం తో సలహాలు , సూచనలు కానీ ,లేకపోతే తాను ఉన్న పరిధిలో ప్రజలకి మాస్కులు , శానిటైజేర్స్ అందజేయడం కానీ చేయకుండా ..ఎటువంటి కష్ట సమయంలో తమ కుటుంబ అధీనంలో ఉన్న హెరిటేజ్ లో పాల ధర లీటరకు కనీసం 2 రూపాయలు ఎందుకు పెంచారు ? రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో ..కూరగాయలు రేట్లు పెరిగాయి అంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన చంద్రబాబు ..తన కుటుంభం అధీనంలో ఉన్న హెరిటేజ్ లో పాల ధరని పెంచడం ఎంతవరకు సబబు? రాష్ట్రంలోని ప్రజలు కరోనా దెబ్బకి విలవిలలాడుతోన్న ఇటువంటి సమయంలో ..వీలైతే వారికి సహాయంగా నిలవాలి కానీ , ఇలా రేట్లు పెంచి క్యాష్ చేసుకోవాలనుకోవడం ఏమాత్రం సమంజసం.