Begin typing your search above and press return to search.
హెరిటేజ్ షేర్లపై అసెంబ్లీలో జగన్ ప్రజంటేషన్
By: Tupaki Desk | 4 Dec 2020 12:12 PM GMTచంద్రబాబు ఆయువు పట్టు ఆయన వ్యాపారాలే అంటారు. రాజకీయంగా ఎన్నో సంవత్సరాలు సీఎంగా ఉన్నా ఆయన చేసినవి కొన్ని వ్యాపారాలు మాత్రమే.. అందులో ముఖ్యమైనది ‘హరిటేజ్’ పాలు కూరగాయల వ్యాపారమే. అయితే చంద్రబాబు సీఎం అయ్యాక అదో పెద్ద సూపర్ మార్కెట్ సిస్టంగా మారింది. ఎలా అయ్యిందనే దానిపై అంతులేని రహస్యాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.
తాజాగా హెరిటేజ్ గుట్టును అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ విప్పారు. హెరిటేజ్ సంస్థ అంత పెద్దగా ఎలా ఎదిగిందనే దానిపై సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చి మరీ ఎండగట్టారు.
హెరిటేజ్ షేర్లు చూస్తే షేర్ రిగ్గింగ్ చేస్తారేమోనని అనుమానం కలుగుతోందని సీఎం జగన్ అన్నారు. హెరిటేజ్ షేర్ విలువ హెచ్చుతగ్గులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు.
‘1999లో రూ.2గా ఉన్న షేర్ విలువ చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడు పెరుగుతూ.. ఓడిపోగానే పడిపోతూ వస్తుందన్నారు.
2017 డిసెంబర్ లో ఏకంగా రూ.827కి చేరిందని వివరించారు. మళ్లీ ఓడిపోగానే 2020 మార్చి నాటికి రూ.205కి పడిపోయిందని జగన్ వివరించారు. ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఆ అండతో చంద్రబాబు గోల్ మాల్ చేసాడని జగన్ ఆరోపించారు.