Begin typing your search above and press return to search.
రిలయన్స్ కీలక వ్యాపారాన్ని బాబు టీం కొనేసింది
By: Tupaki Desk | 13 April 2017 10:48 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కుటుంబ సంస్థ హెరిటేజ్ తన వ్యాపారంలో మరో ముందడుగు వేసింది. ఇటీవల తన వ్యాపారంలోకి కీలక విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్ కు అమ్మేసిన హెరిటేజ్..తాజాగా మరో బడా కంపెనీలోని కీలక విభాగాన్ని కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ కి (ఆర్ ఆర్ ఎల్) చెందిన డెయిరీ వ్యాపార విభాగాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కైవసం చేసుకుంది. రిలయన్స్ రిటైల్ డెయిరీ ప్రొడక్ట్ లను పూర్తిగా తమ సొంతం చేసుకున్నట్టు కంపెనీ ప్రకటించగానే హెరిటేజ్ షేర్లు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. కంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం పొంది రిలయన్స్ డెయిరీ బిజినెస్ కొనుగోలును పూర్తిచేశామని హెరిటేజ్ ఫుడ్స్ బీఎస్ ఈ ఫైలింగ్ లో తెలిపింది. ఏప్రిల్ 12 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపింది.
కాగా, మార్కెట్ అవర్స్ లో ఈ ప్రకటనను హెరిటేజ్ ఫుడ్స్ విడుదల చేయడంతో సంస్థకు బాగా కలిసివచ్చింది. 1.71 శాతం లాభాలతో 1092.20గా ట్రేడవుతున్నాయి. 2016 డిసెంబర్ క్వార్టర్లో హెరిటేజ్ ఫుడ్స్ నికరలాభాలు 75.11 శాతం పైకి ఎగిసి 19.91 కోట్లగా నమోదయ్యాయి. హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ- రిటైల్- అగ్రి-బేకరీ- పునరుద్ధరించే ఇంధన వనరుల విభాగాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. రిలయన్స్ డెయిరీ విభాగం 2007 నుంచి దేశవ్యాప్తంగా పాల సేకరణ - ప్రాసెసింగ్ - పంపిణీ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రధానంగా డెయిరీ లైఫ్ - డెయిరీ ప్యూర్ బ్రాండ్స్ కింద ప్యాక్డ్ మిల్క్ - ఫ్లేవర్డ్ మిల్క్ - డెయిరీ వైట్‌నర్ - నెయ్యి - వెన్న - స్వీట్స్ తదితర ఉత్పత్తులు విక్రయిస్తోంది. ఈ రెండు సంస్థల విలీనం ద్వారా తమ వినియోగదారులకు మరిన్ని సేవలు అందించనున్నట్లు హెరిటేజ్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/