Begin typing your search above and press return to search.
ఖరీదైన మద్యం.. పేకాట దందా..!వెలుగు చూస్తున్న శిల్పా అక్రమాలు..
By: Tupaki Desk | 30 Nov 2021 11:31 AM GMTకిట్టీ పార్టీలతో కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. కోట్ల రూపాయలు మోసపోయామని పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. శిల్పా చౌదరి గురించి తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే బాధితుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకర విషయమేంటంటే టాలీవుడ్ కు చెందిన ఓ ఫ్యామిలీ కూడా ఈ చిక్కుల్లో ఇరుక్కున్నట్లు సమాచారం. మోససోయిన వారిలో కొందరు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా..మరికొందరు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ డీసీపీని కలిసి వివరాలు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.
నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో కదిలిన ఈ వ్యవహారం బయటికి వచ్చింది. దివ్య అనే మహిళ తాను కోట్ల రూపాయలు మోసపోయినట్లు ఫిర్యాదు చేయడంతో శిల్పా చౌదరి అక్రమాలు బయటకు వచ్చాయి. అయితే కొందరు ప్రముఖులు బాధితులుగా ఉన్న ముందుగా పరువు పోతుందని ఫిర్యాదు చేయలేదు. కానీ ఆ తరువాత తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లకువెళ్లి ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇప్పటికే 200 కోట్ల వరకు ఫ్రాడ్ జరగొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో కుటుంబ కూడా బాధితుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఆ కుటుంబ రూ.12 కోట్లు మోసపోయినట్లు తెలుస్తోంది. అయితే మోసపోయిన వారు టాలీవుడ్ హీరోలకు అత్యంత ఆప్తులుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ వ్యాపరంలో పెట్టుబడి కోసం ఒక్కొక్కరి వద్ద రూ. 6 కోట్ల చొప్పున మొత్తం 12 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నటుడు రూ.2.4 కోట్లు మోసపోయినట్లు సమాచారం. కాగా బాధితులు జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చినట్లు సమాచారం. అయితే వారి వివరాలు పోలీసులు బయటకు చెప్పడం లేదు.
సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే కాకుండా పోలీస్, న్యాయవాది కుటుంబం కూడా శిల్పాచౌదరికి భారీ మొత్తాన్నే అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఓ పోలీస్ ఉన్నతాధికారి కుటుంబం రూ.6 కోట్లు, కీలక స్థానంలో ఉన్న న్యాయమూర్తి కుటుంబ సభ్యులు రూ.5 కోట్లు వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. కాగా పంజాగుట్టకు నవీన్ నగర్ కు చెందిన సుమంత్ రూ. 15 లక్షలు ఇచ్చారు. అయితే తాను శిల్పాచౌదరిపై వస్తున్న వార్తలను తెలుసుకొని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.
ఎక్కుగా సంపన్న వర్గాల మహిళలనే చేర్చుకునే శిల్పా చౌదరి వారికి కిట్టీ పార్టీలతో వల వేసేది. ఆ తరువాత కొందరి మహిళలకు స్పా వీడియోలను ఏర్పాటు చేసింది. అయితే తనను డబ్బులు డిమాండ్ చేసిన వారికి చెందిన స్పా వీడియోలను బయటపెడతానని బెదరించిందని పోలీసులు వెల్లడిస్తున్నారు. కిట్టీ పార్టీలే కాకుండా పేకాట కూడా నిర్వహించినట్లు సమారారం. లక్షల ఖరీదైన మద్యాన్ని సరఫరా చేసేదని అంటున్నారు. అయితే పోలీసులకు ఆ సమాచారం ఉండడంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇక శిల్పా చౌదరి భర్త కృష్ణ శ్రీనివాస ప్రసాద్ అలెక్సా అనే ఒక కంపెనీలో రీజినల్ డైరెక్టర్ గా పనిచేసేవారు. ఆయన తన భార్య చేస్తున్న మోసాల్లో పాలుపంచుకునేవారు. ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ దందా నడిపించినట్లు తెలుస్తోంది. అయితే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందని ఆశ జూపి వీరిద్దరు చాలా మందని మోసం చేసినట్లు తెలుస్తోంది. దివ్యరెడ్డి అనే అమ్మాయి సైతం భూమి కొనుగోలు కోసం డబ్బుఇచ్చిందని, అటు భూమిగాని, ఇటు డబ్బుగానీ ఇవ్వకపోవడంతోనే ఆమె పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.