Begin typing your search above and press return to search.
హీరో హిట్టు... సేనాని సూపర్ హిట్టూ... ?
By: Tupaki Desk | 26 Feb 2022 8:33 AM GMTప్రజా జీవితంతో ముడిపడి ఉన్న రెండు కీలకమైన రంగాలు సినిమా, రాజకీయాలు. ఈ రెండు రంగాల్లో రాణించడం అంటే ఎవరికైనా కష్టం. అలా సక్సెస్ అయిన వారు ఎమ్జీయర్, ఎన్టీయార్, జయలలిత మాత్రమే. ఆ తరువాత ఎందరు తారలు రాజకీయాల్లోకి వచ్చినా కూడా మెరుపులే తప్ప విజయాలు మాత్రం లేవు. దానికి కారణం హీరో అంటే రీల్ లైఫ్. అంతా నా ఇష్టం అన్నట్లుగా అక్కడ సాగుతుంది. రాజకీయాలు అయితే పూర్తిగా ప్రజలకు చెందినవి అయి ఉంటాయి. వారి ఇష్టాల మేరకే ఎవరైనా నడచుకోవాలి.
పైగా ఇక్కడ జనాలను ఎవరు మెప్పిస్తారో వారే అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎంటీయార్ తరువాత వెండి తెర నుంచి వెళ్ళి సీఎం అయిన వారు ఎవరూ లేరు. చిరంజీవికి ఆ అవకాశం ఉన్నా కొన్ని వ్యూహాలు సరిగ్గా లేకపోవడం వల్లనే పీఠాన్ని అందుకోలేకపోయారు.
ఆ కసితో పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఎనిమిదేళ్ల క్రితం జనసేన పార్టీని పెట్టారు. పవన్ 2019 ఎన్నికలను ఫేస్ చేశారు కూడా. అయితే చేదు ఫలితాలు వచ్చాయి. ఈ మూడేళ్ళలో చూస్తే రాజకీయంగా పవన్ పట్టు సాధించారా అంటే ఆయన పరిమితంగానే ఇక్కడ తన పాత్ర పోషిస్తున్నారు. సినిమాల్లో మాత్రం హీరోగా ఆయన జోరు పెంచారు.
గత ఏడాది రిలీజ్ అయిన వకీల్స్ సాబ్ హిట్ అయితే తాజాగా వచ్చిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ అయింది. ఒక విధంగా పవర్ స్టార్ కి తిరుగులేదని చాటింది. వెండి తెర మీద ఆయన్ని కొట్టే వారు లేరనే చెప్పాలి. ఇక పవన్ ఫ్యాన్స్ కూడా వెల్లువలా ఉంటారు. ఎవరికీ లేనంతమంది అభిమాన గణం ఆయన సొంతం. మరి అలాంటి అభిమానులు అంతా పవన్ సినిమా హిట్ కోసమే గట్టిగా పనిచేస్తున్నారు.
మరి వారే ఇటు వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే రాజకీయాల్లో కూడా జనసేనకు లాభం కలుగుతుంది. అయితే సినిమా వేరు, రాజకీయాలు వేరు అని ముందే చెప్పుకున్నట్లుగా అన్ని పార్టీల అభిమానులూ పవన్ కి ఫ్యాన్స్. కానీ రాజకీయాలు అనేసరికి ఎవరి ఇష్టాలు వారికి ఉన్నాయి. అందుకే సేనాని కి అసలైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం చదివితే సరిపోదు. రాజకీయాల్లో లెక్కలు చాలా ఉంటాయి. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ రోజు భీమ్లా నాయక్, రేపటి రోజున ఏపీకే నాయక్ అని బిగ్ సౌండ్ చేస్తున్నారు. అది వారి సంతోషం. తమ హీరో ఏపీకి సీఎం కావాలని వారి కోరిక. అందులో తప్పేమీలేదు. ఇది ప్రజాస్వామ్యం పవన్ సీఎం కావచ్చు. అలాగే ఎవరైనా జనం మెచ్చితే సీఎం అవుతారు.
కానీ దానికి చేయాల్సిన కసరత్తు చాలానే ఉంటుంది. దాన్నే పవన్ అభిమాన జనాలు మరచిపోతున్నారు. ప్రజల వద్దకు వెళ్ళి అండగా ఉండాలి. తమ పార్టీ గురించి చెప్పాలి. కనీసం ఈ రోజు నుంచి అది మొదలుపెడితే కొత్త ఓటర్లు ఎన్నికల వేళకు తయారు అవుతారు. ఇక పవన్ సైతం తన పార్టీని గ్రౌండ్ లెవెల్ దాకా విస్తరించి బాధ్యతలను అందరికీ అప్పగించాలి.
ఏదో తాను మీటింగునకు వస్తేనే జనాలు సందడి చేయడం కాకుండా జనసేన కార్యక్రమాలు నిరంతరం జరిగేలా చూడాలి. ఇంకో వైపు జనసేన పొత్తుల పార్టీ కాదన్న భావన జనాల్లో కలిగించాలి. జనసేన టీడీపీ పొత్తు అనేలా తమ్ముళ్ళు తెల్లారి లేస్తే కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాటిని గట్టిగా తిప్పికొడుతూ తామే సొంతంగా అధికారంలోకి వస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అన్న ధీమాను క్యాడర్ లోనే కాదు జనంలోకీ పంపాలి.
అలా చేసిన నాడు భీమ్లా నాయక్ ఏపీకి కూడా నాయక్ అవుతారు. లేకపోతే పాలపొంగు లాంటి సినీ అభిమానాన్ని చూసి అదే నిజం అనుకుంటే రియల్ లైఫ్ లో వేరేగా ఉంటుంది. సోం పవన్ మార్క్ పాలిటిక్స్ గట్టిగా చూపించాలని అభిమానులే కాదు మిగిలిన జనాలూ కోరుకుంటున్నారు.