Begin typing your search above and press return to search.

ఈ అమెరికన్ ను తెలుగు వాళ్లు పొగిడేస్తున్నారు

By:  Tupaki Desk   |   24 Feb 2017 1:48 PM GMT
ఈ అమెరికన్ ను తెలుగు వాళ్లు పొగిడేస్తున్నారు
X
అమెరికాలోని కన్సాస్ కు ఇయాన్ గ్రిల్ల‌ట్‌ ఇప్పుడు ఆ దేశంలోని తెలుగువారిలో హీరో అయ్యాడు. ఈ 24 ఏళ్ల యువ‌కుడు తెలుగు యువ‌కుల్ని కాపాడేందుకు ప్ర‌య‌త్నించాడు. క‌న్సాస్‌ లోని ఆస్టిన్ బార్‌ లో గురువారం జ‌రిగిన కాల్పుల్లో హైద‌బాద్‌ కు చెందిన ఇంజినీర్ శ్రీ‌నివాస్ మృతిచెందాడు. మ‌రో యువ‌కుడు అలోక్ గాయ‌ప‌డ్డాడు. అయితే బార్‌ లో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు అక్క‌డే ఉన్న గ్రిల్ల‌ట్ ఆగంత‌కుడి నుంచి పిస్తోల్ లాక్కునేందుకు ప్ర‌య‌త్నించాడు. శ్వేత‌జాతీయుడు ఆడ‌మ్ పురింట‌న్ జ‌రిపిన కాల్పుల్లో గ్రిల్ల‌ట్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. పురింట‌న్ నుంచి గ‌న్‌ ను లాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడు గ్రిల్ల‌ట్ ఛాతిలో, చేయికి బుల్లెట్లు దిగాయి. ప్ర‌స్తుతం అత‌ను హాస్ప‌ట‌ల్లో కోలుకుంటున్నాడు.

తాజా ఉదంతంలోనేవీ మాజీ ఉద్యోగి పురింట‌న్‌ ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన గ్రిల్ల‌ట్ తాను చూపిన తెగువ‌ను త‌న క‌ర్త‌వ్యంగా భావిస్తున్న‌ట్లు చెప్పాడు. ప్ర‌తి ఒక్క‌రు చేయాల్సిందే తాను చేసిన‌ట్లు చెప్పాడు. జాతి, దేశం గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌ని, మ‌నం అంద‌రం మాన‌వుల‌ని, అందుకే తెలుగు యువ‌కుల్ని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు గ్రిల్ల‌ట్ తెలిపాడు. అదృష్ట‌వ‌శాత్తు గ్రిల్ల‌ట్ ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని స్థానిక మీడియా పేర్కొన్న‌ది. కాల్పుల ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ అలోక్ త‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు హాస్ప‌ట‌ల్‌కు వ‌చ్చిన‌ట్లు గ్రిల్ల‌ట్ చెప్పాడు.

కాగా అమెరికన్లలో కొందరు తమదైన శైలిలో జాత్యంహకారంతో దుశ్చర్యలకు పాల్పడుతుంటే గ్రిల్లట్ వంటి వారు మాత్రం మేమున్నామంటూ వలసదారులకు అండగా ఉంటున్నారని చెప్తున్నారు. అయినా అగ్రరాజ్యం అందరిదీ అనే భావనను ఆ దేశ పాలకులు కల్పించాల్సిన భావన ఎంతైనా ఉందనేది అందరి మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/